డిజిటల్ మ్యాపింగ్ కంపెనీ మ్యాప్ మై ఇండియా ఈరోజు స్టాక్ మార్కెట్‌లో లిస్టయింది. 53 శాతం ప్రీమియంతో బీఎస్ఈలో రూ.1,581 వద్ద ఈ స్టాక్ లిస్టైంది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 51.5 శాతం ప్రీమియంతో రూ.1,565 వద్ద లిస్టైంది. ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.1,033గా ఉంది. దీంతో మొదటి రోజే ఇన్వేస్టర్లపై కనక వర్షం కురిపించింది. బలమైన లిస్టింగ్ తర్వాత, షేరు గరిష్ఠంగా రూ.1,586.85కి చేరుకుంది. MapMyIndia మాతృ సంస్థ CE ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ యొక్క IPO డిసెంబర్ 9న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమై డిసెంబర్ 13న ముగిసింది.
ఈ కంపెనీలో ఇప్పటికే ఉన్న వాటాదారులు, ప్రమోటర్లకు 10,063,945 వరకు ఈక్విటీ షేర్లు ఉన్నాయి. OFSలో రష్మీ వర్మ ద్వారా 42.51 లక్షల వరకు ఈక్విటీ షేర్లు, క్వాల్కమ్ ఆసియా పసిఫిక్ Pte Ltd ద్వారా 27.01 లక్షల వరకు ఈక్విటీ షేర్లు, జెన్రిన్ కంపెనీ లిమిటెడ్‌కు 13.7 లక్షల వరకు ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ఈ కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.312 కోట్లు సమీకరించింది.
మ్యాప్ మై ఇండియా 2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 59.43 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఇది అంతకు ముందు సంవత్సరంలో రూ. 23.19 కోట్లుగా ఉంది. ఇదే కాలంలో ఆదాయం రూ.148.63 కోట్ల నుంచి రూ.152.46 కోట్లకు పెరిగింది.
Read Also. Year Ender 2021: ఈ ఏడాదిలో రూ.25 వేల లోపు విడుదలైన అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!