Mahindra Thar Roxx: ఆ కారు హాట్ కేకు.. గంటలోనే 1.76లక్షల బుకింగ్స్.. అంతలా ఆ కారులో ఏముందబ్బా?

|

Oct 06, 2024 | 3:36 PM

దాని ఆకర్షణీయ లుక్, అధిక పనితీరు కారణంగా ఇది మార్కెట్లో టాప్ ఆప్షన్ గా మారింది. దీనికి తాజా ఉదాహరణ ఇటీవల థార్ రాక్స్ బుకింగ్స్. ఇటీవల విడుదల చేసిన మహీంద్రా థార్ రాక్స్ కోసం వినియోగదారులు ఎగబడ్డారు. రికార్డు స్థాయిలో బుకింగ్ చేశారు. గంటలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా బుకింగ్స్ చేసి కొత్త రికార్డులు సృష్టించింది.

Mahindra Thar Roxx: ఆ కారు హాట్ కేకు.. గంటలోనే 1.76లక్షల బుకింగ్స్.. అంతలా ఆ కారులో ఏముందబ్బా?
Mahindra Thar Roxx
Follow us on

మన దేశీయ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీకి చెందిన కార్లు ఎక్కువగా ఎస్‌యూవీ, ఎక్స్‌యూవీ వేరియంట్లే అధికంగా ఉంటాయి. ఇటీవల కాలంలో ఎక్కువశాతం ఈ మోడళ్లను కొనుగోలు చేస్తున్నారు. కాగా మహీంద్రా నుంచి లాంచ్ అయిన థార్ కారుకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. దాని ఆకర్షణీయ లుక్, అధిక పనితీరు కారణంగా ఇది మార్కెట్లో టాప్ ఆప్షన్ గా మారింది. దీనికి తాజా ఉదాహరణ ఇటీవల థార్ రాక్స్ బుకింగ్స్. ఇటీవల విడుదల చేసిన మహీంద్రా థార్ రాక్స్ కోసం వినియోగదారులు ఎగబడ్డారు. రికార్డు స్థాయిలో బుకింగ్ చేశారు. గంటలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా బుకింగ్స్ చేసి కొత్త రికార్డులు సృష్టించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

గంటలోనే కొత్త రికార్డులు..

మహీంద్రా కొత్త బుకింగ్ రికార్డును నెలకొల్పింది. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజున లాంచ్ అయిన థార్ రాక్స్ రికార్డు స్థాయి బుకింగ్స్ చేపట్టింది. బుకింగ్స్ ప్రారంభించిన ఒక గంటలోనే ఏకంగా 1,76, 218 మంది ఈ కారు ని బుక్ చేసుకున్నారు. అంటే నిమిషానికి 2,937 యూనిట్లు బుక్ అయ్యాయి. ఇది ఆన్ లైన్ ఆర్డర్లతో డీలర్ షిప్ ల వద్ద ప్రీ ఆర్డర్లు కూడా ఉన్నాయి.

దసరా నుంచి డెలివరీలు..

ఈ థార్ రాక్స్ కారు స్టైలిష్ లుక్ లో ఆకర్షనీయంగా ఉంటుంది. అధిక పనితీరు, ముఖ్యంగా ఆఫ్ రోడ్ విషయంలో తిరుగులేని విధంగా ఉంటుంది. స్పేషియస్ ఇంటీరియర్స్, అత్యాధునిక భద్రతా ఫీచర్లు, ఎస్యూవీ మార్కెట్లో లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొస్తోంది. దీని డెలివరీలు దసరా పండుగ రోజు నుంచి చేయనుంది. మహీంద్రా వినియోగదారులకు సులభమైన డెలివరీ మేనేజ్మెంట్ ను అందించేందుకు మూడు వారాల షెడ్యూల్ ను ప్రకటించింది. కాగా ఇప్పటికీ బుకింగ్స్ కొనసాగుతున్నాయని కంపెనీ ప్రకటించింది.

థార్ రాక్స్ ప్రత్యేకతలు..

ఈ కొత్త థార్ ఏడు కలర్ ఆప్షన్లతో వస్తోంది. ఏడు వేరియంట్లు పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో అందుబాటులో ఉంటుంది. దీని ధర లు రూ. 12.99లక్షల నుంచి రూ. 18.79లక్షలు(ఎక్స్ షోరూం) వరకూ ఉంటుంది. ఇది మూడు డోర్ల వెర్షన్ కన్నా పెద్దదిగా ఉంటుంది. కొత్త గ్రిల్, ఎల్ఈడీ లైట్లు, 19 అంగుళాల చక్రాలు, ఆఫ్ రోడింగ్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

ఇవి కాక పానరోమిక్ సన్ రూఫ్, వెటిలేటెడ్ సీట్లు, వెనుకవైపు ఏసీ వెంట్లు, 10.2 అంగుళాల ఇన్ఫో టైన్ మెంట్ సిస్టమ్, కార్డన్ సౌండ్ సిస్టమ్ వంటివి ఉంటాయి. సేఫ్టీ కోసం లెవెల్ 2 అడాస్, 6 ఎయిర్ బ్యాగ్స్ వంటి భద్రతా ఫీచర్లు ఉంటాయి. ఈ థార్ రాక్స్ కారు ఐదు డోర్ల ఎస్యూవీ సెగ్మెంట్లోని క మారుతి జిమ్నీ, ఫోర్స్ గుర్కా వంటి వాటితో పోటిపడనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..