Mahindra: మహీంద్రా మరో సంచలనం.. ప్రపంచ స్థాయి డిజైన్‌తో 4 అద్భుతమైన SUVలు

Mahindra SUV: 15 ఆగస్టు 2025 సందర్భంగా కంపెనీ తన గ్లోబల్ విజన్ 2027ను ప్రదర్శించింది. దీని కింద NU_IQ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా నాలుగు కొత్త SUVలు తయారు చేయనుంది కంపెనీ. అవి ప్రపంచ స్థాయి డిజైన్‌తో పాటు ఫీచర్లు, భద్రత..

Mahindra: మహీంద్రా మరో సంచలనం.. ప్రపంచ స్థాయి డిజైన్‌తో 4 అద్భుతమైన SUVలు

Updated on: Aug 16, 2025 | 3:15 PM

Mahindra SUV: మహీంద్రా & మహీంద్రా చివరకు తన నాలుగు కొత్త విజన్ కాన్సెప్ట్ SUV లను ఆవిష్కరించింది. ఇవి బ్రాండ్ కొత్త NU IQ మాడ్యులర్ మోనోకోక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించారు. ఈ SUV ల ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న వెర్షన్లు 2027 లో రావడం ప్రారంభిస్తాయి. ఆటోమేకర్ ఇంకా ప్రతి మోడల్ పూర్తి వివరాలను వెల్లడించనప్పటికీ, మహీంద్రా విజన్ S కాన్సెప్ట్ స్కార్పియో కుటుంబంలో చేరే అవకాశం ఉంది. ఈ కాన్సెప్ట్ తదుపరి తరం స్కార్పియో, స్కార్పియో EV లేదా స్కార్పియో ఆధారంగా కాంపాక్ట్ SUV కావచ్చునని ఊహాగానాలు వస్తున్నాయి.

15 ఆగస్టు 2025 సందర్భంగా కంపెనీ తన గ్లోబల్ విజన్ 2027ను ప్రదర్శించింది. దీని కింద NU_IQ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా నాలుగు కొత్త SUVలు తయారు చేయనుంది కంపెనీ. అవి ప్రపంచ స్థాయి డిజైన్‌తో పాటు ఫీచర్లు, భద్రత ఫీచర్స్‌ ఉంటాయి. ఈ సందర్భంగా కంపెనీ Vision.S, Vision.T, Vision.SXT, Vision.X వంటి నాలుగు రాబోయే SUVల కాన్సెప్ట్ మోడళ్లను కూడా ఆవిష్కరించింది. ఈ వాహనాలన్నీ కొత్త NU_IQ ప్లాట్‌ఫారమ్‌పై తయారు అవుతాయి.కంపెనీ వాటిని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో పరిచయం చేస్తుంది.

ఈ కార్లు వివిధ రకాల ఇంజిన్లు, డిజైన్లు, ఫ్రంట్/ఆల్-వీల్ డ్రైవ్, లెఫ్ట్/రైట్ హ్యాండ్ డ్రైవ్లకు అనుకూలంగా ఉంటాయి. అంటే మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా వీటిని మార్చవచ్చు. ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా భవిష్యత్తులో రాబోయే సరికొత్త ఎస్యూవీల శ్రేణిని కంపెనీ పరిచయం చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌ తయారు చేసే నాలుగు అద్భుతమైన కాన్సెప్ట్ కార్లను ప్రదర్శించి తమ తదుపరి తరం ఉత్పత్తుల గురించి ఒక సూచన ఇచ్చింది.

ఈ సందర్భంగా మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్, ఆటోమోటివ్ బిజినెస్ (నియమిత) ప్రెసిడెంట్, మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. వేలుస్వామి మాట్లాడుతూ.. “NU_IQ అనేది ప్రపంచవ్యాప్తంగా మహీంద్రా SUVs భవిష్యత్తు కోసం రూపొందించిన ఒక వ్యూహాత్మక ప్రణాళిక. ఈ ప్లాట్‌ఫామ్‌ మాడ్యులర్, మల్టీ-ఎనర్జీ నిర్మాణంతో రూపొందింది. అందుకే తాము వివిధ రకాల టాప్ హాట్స్, పవర్ట్రెయిన్లతో కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతున్నాం” అని చెప్పారు. అంతేకాకుండా, ఇది మహీంద్రా SUVల స్వభావాన్ని నిలుపుకుంటుందని స్పష్టం చేశారు. NU_IQ ప్లాట్ఫామ్ భవిష్యత్ తరాల SUVలకు పునాది అని, ఇది వినియోగదారులకు రాజీ పడాల్సిన అవసరం లేకుండా, కోరుకునే ప్రీమియం SUVsను అందిస్తుందని వివరించారు.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. వీటిపై 75 శాతం రాయితీ!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి