CNG: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్‌ 1 నుంచి ఆ రాష్ట్రంలో CNG ధర తగ్గింపు..!

|

Mar 27, 2022 | 2:23 PM

CNG: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోతున్నాయి. అలాగే సీఎన్‌జీ (Compressed Natural Gas) గ్యాస్‌ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం..

CNG: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్‌ 1 నుంచి ఆ రాష్ట్రంలో CNG ధర తగ్గింపు..!
Follow us on

CNG: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోతున్నాయి. అలాగే సీఎన్‌జీ (Compressed Natural Gas) గ్యాస్‌ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో మహారాష్ట్ర (Maharashtra) ప్రజలకు పెద్ద ఊరట లభించనుంది. మహారాష్ట్రలో సహజ వాయువు ( CNG ) ఏప్రిల్ 1 నుండి చౌకగా మారనుంది. మహారాష్ట్ర ప్రభుత్వం సీఎన్‌జీపై (CNG) వ్యాట్ రేట్లను భారీగా తగ్గించాలని నిర్ణయించింది. ప్రభుత్వం CNGపై వ్యాట్‌ను 13.5 శాతం నుంచి 3 శాతానికి తగ్గించింది. CNG కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2022 నుండి వర్తిస్తాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సీఎన్‌జీ వాహన యజమానులకు ఊరట లభించనుంది. వారు CNG కోసం తక్కువ చెల్లించవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో సహజవాయువుపై వ్యాట్‌ను 13.5 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని మహారాష్ట్ర ఆర్థిక మంత్రి అజిత్‌ పవార్‌ ప్రతిపాదించారు. పన్ను తగ్గింపు వల్ల రాష్ట్రానికి ఏటా రూ.800 కోట్ల నష్టం వాటిల్లుతుందని బడ్జెట్‌ సమావేశాల్లో తెలిపారు. సహజవాయువు పర్యావరణ అనుకూలమైనదని, దేశీయ పైపుల గ్యాస్ సరఫరాకు, CNGతో నడిచే మోటారు వాహనాలు, ఆటో-రిక్షాలు, టాక్సీలు మరియు ప్రైవేట్ వాహనాలకు కూడా విస్తృతంగా ఉపయోగించబడుతుంది అని పవార్ బడ్జెట్ సెషన్‌లో చెప్పారు.

బిజినెస్ టుడే నివేదిక ప్రకారం.. మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో సీఎన్‌జీ పై వ్యాట్‌ను తగ్గిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఏప్రిల్ 1 నుండి రాష్ట్రంలో CNG చౌకగా ఉంటుంది. ఇది ఆటోరిక్షా, టాక్సీ డ్రైవర్లు, ప్యాసింజర్ వాహనాలతో పాటు పౌరులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. మహారాష్ట్ర రాజధాని ముంబై, దాని పరిసర ప్రాంతాలకు మహానగర్ గ్యాస్ CNGని సరఫరా చేస్తుంది. ప్రస్తుతం ముంబైలో సీఎన్‌జీ ధర కిలో రూ.66గా ఉంది.

CNG ఇక్కడ ఖరీదైనది

ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఇటీవల ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో సిఎన్‌జి ధరలను కిలోకు 50 చొప్పున పెంచింది. PNG ధర SCMకి 1 చొప్పున పెంచబడింది. ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలో రూ.59.01కి పెరిగింది. అదే సమయంలో నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో సీఎన్‌జీ ధర కిలో రూ.61.58కి పెరిగింది. గుజరాత్‌లోనూ సీఎన్‌జీ ఖరీదైనది. గుజరాత్ గ్యాస్ సీఎన్‌జీ ధరలను కిలోకు 3 రూపాయలు పెంచింది. ఇక్కడ ఇప్పుడు ఒక కేజీ సీఎన్‌జీకి రూ.70.53 చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

PhonePe: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఫోన్‌పేలో ఈ సదుపాయం

Credit Debit Card: క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వాడుతున్నారా..? జాగ్రత్త.. ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!