దేశ ప్రజలకు కేంద్రం రక్షాబంధన్, ఓనమ్ గిఫ్ట్‌ను ఇచ్చింది. వంట్యగ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. వంట గ్యాస్ తర్వాత, ఇప్పుడు ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను తగ్గించింది. కొత్త ధర నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ రోజు నుంచి అంటే సెప్టెంబర్ 1, 2023 నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలో పెద్ద తగ్గింపు ఉంది. అదే సమయంలో కొన్ని రోజుల క్రితం ఎల్‌పీజీ ధర రూ.200 తగ్గింది.
ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు (OMC) ప్రకారం, ఇప్పుడు LPG వినియోగదారులు న్యూఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కోసం రూ.1,522 చెల్లించాలి. కోల్‌కతాలో 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ ధర 1636 రూపాయలుగా, ముంబైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 1482 రూపాయలుగా, చెన్నైలో 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర 1695 రూపాయలుగా ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ధరలు అమలు అవుతున్నాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, తిరుపతిలలో కూడా తగ్గింపు లభిస్తోంది.
మహిళలకు కానుక ఇస్తూనే ప్రభుత్వం రక్షాబంధన్‌కు ముందు రోజు ఇంటి గ్యాస్‌పై రూ.200 తగ్గించింది. అదే సమయంలో, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు.. దాని ధర సిలిండర్‌కు రూ.400 తగ్గించింది.
కమర్షియల్, డొమెస్టిక్ LPG రెండింటి ధర నెల మొదటి తేదీన పెరుగుతుంది లేదా తగ్గుతుంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ కొత్త ధర సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. అంతకుముందు ఆగస్టులో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.99.75 తగ్గింది. జూలైలో వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.7 పెంచారు.
జూలైకి ముందు వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు ఈ సంవత్సరం మే, జూన్లలో రెండుసార్లు తగ్గించబడ్డాయి. మే నెలలో చమురు కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరను రూ.172 తగ్గించాయి. జూన్‌లో రూ. 83 తగ్గింది. ఇది కాకుండా ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా వాటి ధరలను యూనిట్‌కు రూ.91.50 తగ్గించారు.
పెట్రోలియం, చమురు కంపెనీలు ఈ ఏడాది మార్చి 1న వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను యూనిట్‌కు రూ.350.50 తగ్గించాయి. దీంతో పాటు ఎల్‌పీజీ సిలిండర్ ధరను యూనిట్‌కు రూ.50 చొప్పున పెంచారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం