కార్లలో సన్‌రూఫ్ అంటే ఒకప్పుడు అదో వింత. ప్రత్యేకమైన లగ్జరీ ఫీచర్. హై ఎండ్ కార్లలోనే ఎక్కువగా కనిపించేవి. అయితే ఇప్పుడు అవి చాలా సాధారణం అయిపోయాయి. అనేక మధ్య-శ్రేణి కార్లలో కూడా సన్‌రూఫ్‌లు వస్తున్నాయి. అత్యంత జనాదరణ పొందిన కార్లలో కూడా ఈ స్పెషల్ ఫీచర్ అందుబాటులో ఉంటోంది. ఈ సన్‌రూఫ్‌లు కారు క్యాబిన్‌లోకి స్వచ్ఛమైన గాలి, సహజ కాంతిని అనుమతిస్తాయి, ప్రయాణికులకు బహిరంగ అనుభూతిని అందిస్తాయి. చాలా మంది కొనుగోలుదారులు సన్‌రూఫ్ కార్లను కోరుకుంటారు కానీ వాటి అధిక ధర కొందరికి ఆందోళన కలిగిస్తుంది. అయితే ఇటీవల కాలంలో వీటి ధరలు కూడా అందుబాటులోకి వచ్చాయి. సన్‌రూఫ్‌తో కూడిన కార్లను మీరు ఇప్పుడు రూ. 10లక్షలకే కొనుగోలు చేయొచ్చు. లాంటి అత్యుత్తమ సన్‌రూఫ్ కార్లను మీకు అందిస్తున్నాం. ఓ లుక్కేయండి..
మైక్రో ఎస్‌యూవీ అయిన టాటా పంచ్ సన్‌రూఫ్ ఆప్షన్‌తో వస్తుంది. టాటా ఈ ఫీచర్‌ను 9 వేరియంట్‌లలో అందిస్తోంది. అవి అకాంప్లిష్డ్ ఎంటీ సన్‌రూఫ్, అకాంప్లిష్డ్ డాజిల్ ఎంటీ సన్‌రూఫ్, అకాంప్లిష్డ్ ఏఎంటీ సన్‌రూఫ్, క్రియేటివ్ డ్యూయల్ టోన్ ఎంటీ సన్‌రూఫ్, అకాంప్లిష్డ్ డాజిల్ ఏఎంటీ సన్‌రూఫ్, క్రియేటివ్ ఫ్లాగ్‌షిప్ డ్యూయల్ టోన్ ఎంటీ, క్రియేటివ్ డ్యువల్ సన్‌రూఫ్, క్రియేటివ్ డ్యాజ్ టునే ఫ్లాగ్‌షిప్ డ్యూయల్ టోన్ ఏఎంటీ సన్‌రూఫ్. టాటా పంచ్ ధర రూ. 8.24 లక్షల నుంచి రూ. 10.09 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
మైక్రో ఎస్‌యూవీ అయిన హ్యుందాయ్ ఎక్స్‌టర్ కూడా సన్‌రూఫ్ ఫీచర్‌తో అందుబాటులోకి వస్తుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ 11 వేరియంట్‌లలో ఈ ఫీచర్‌ను అందిస్తుంది: ఎస్‌ఎక్స్ 1.2 ఎంటీ, ఎస్‌ఎక్స్ 1.2 ఎంటీ డ్యూయల్ టోన్, ఎస్‌ఎక్స్ (0) 1.2 ఎంటీ, ఎస్‌ఎక్స్ 1.2ఏఎంటీ, ఎస్‌ఎక్స్ 1.2 ఏఎంటీ డ్యూయల్ టోన్, ఎస్‌ఎక్స్ 1.2 సీఎన్‌జీ ఎంటీ, ఎస్‌ఎక్స్(0) ఏఎంటీ, 1.2 (0) కనెక్ట్ 1.2 ఎంటీ, ఎస్‌ఎక్స్ (0) కనెక్ట్ 1.2 ఎంటీ డ్యూయల్ టోన్, ఎస్‌ఎక్స్ (0) కనెక్ట్ 1.2 ఏఎంటీ, ఎస్‌ఎక్స్ (0) కనెక్ట్ 1.2 ఏఎంటీ డ్యూయల్ టోన్. ఈ కారు ధర రూ. 8.23లక్షల నుంచి రూ. 10.27 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.
టాటా ఆల్ట్రోజ్ ఒక హ్యాచ్‌బ్యాక్ మోడల్, భారతదేశంలో సన్‌రూఫ్ ఫీచర్‌తో అత్యంత సరసమైన ఆఫర్. టాటా ఆల్ట్రోజ్ 17 వేరియంట్‌లలో ఈ ఫీచర్‌ను అందిస్తుంది: అవి ఎక్స్‌ఎం (ఎస్) పెట్రోల్, ఎక్స్‌ఎం ప్లస్ (ఎస్), ఎక్స్‌ఎం ప్లస్ (ఎస్) ఐసీఎన్‌జీ, ఎక్స్‌ఎంఏ ప్లస్ (ఎస్), జెడ్‌ఎక్స్ ప్లస్(ఎస్), ఎక్స్‌ఎం మోర్(ఎస్). డీజిల్, ఎక్స్‌జెడ్ ప్లస్ (ఎస్) డార్క్ ఎడిషన్, జెడ్‌ఎక్స్ ప్లస్ (ఓ)(ఎస్), ఎక్స్‌జెడ్ ప్లస్ ఐ-టర్బో (ఎస్), జెడ్‌ఎక్స్ ప్లస్ (ఎస్) ఐసీఎన్జీ, ఎక్స్‌జెడ్‌ఏ ప్లస్ (ఎస్), ఎక్స్‌జెడ్ ప్లస్ (ఎస్) డీజిల్ , ఎక్స్‌జెడ్ ప్లస్ (ఓ)(ఎస్) ఐసీఎన్జీ, ఎక్స్‌జెడ్‌ఏ ప్లస్ (ఓ)(ఎస్), ఎక్స్‌జెడ్ ప్లస్ (ఎస్) డార్క్ ఎడిషన్ డీజిల్. దీని ధర రూ. 7.34 లక్షల నుంచి రూ. 10.73 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.
సన్‌రూఫ్ ఎంపికను కలిగి ఉన్న మరో హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ ఐ20. ఈ ఫీచర్ ఐ20 నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది: అవి ఆస్టా 1.2 ఎంటీ, ఆస్టా 1.2 ఎంటీ డ్యూయల్ టోన్, ఆస్టా (0) 1.2 ఎంటీ, ఆస్టా (0) 1.2 ఎంటీ డ్యూయల్ టోన్. హ్యుందాయ్ ఐ20 ధర రూ. 9.33 లక్షల నుంచి రూ. 10.17 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ300 అనేది సన్‌రూఫ్ ఫీచర్‌తో కూడిన ఎస్‌యూవీ. సన్‌రూఫ్ ఫీచర్‌ను నాలుగు వేరియంట్‌లలో మహీంద్రా అందిస్తోంది. అవి డబ్ల్యూ4 1.2 పెట్రోల్, డబ్ల్యూ6 1.2 పెట్రోల్, డబ్ల్యూ4 1.5 డీజిల్, డబ్ల్యూ6 1.2 పెట్రోల్ ఏఎంటీ ఉన్నాయి. దీని ధరలు రూ. 8.66 లక్షల నుంచి రూ. 10.70 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..