LIC పాలసీదారులకు హెచ్చరిక.. వారితో జాగ్రత్తగా ఉండండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు.. ఎల్ఐసీ ట్వీట్..

|

May 26, 2021 | 7:19 AM

మీరు ఎల్ఐసీ పాలసీదారులా? అయితే మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిందే. దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా కాంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసీ

LIC పాలసీదారులకు హెచ్చరిక.. వారితో జాగ్రత్తగా ఉండండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు.. ఎల్ఐసీ ట్వీట్..
Lic
Follow us on

మీరు ఎల్ఐసీ పాలసీదారులా? అయితే మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిందే. దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా కాంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసీ ఆఫ్ ఇండియా.. తమ కస్టమర్లకు ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది. ఎండోమెంట్ ప్లాన్స్, చిల్డ్రన్స్ ప్లాన్స్, పెన్షన్ ప్లాన్స్, హెల్త్ ప్లాన్స్, లైఫ్ ప్లాన్స్ ఇలా పలు రకాల పాలసీలు అందిస్తోంది. అలాగే పాలసీలకు సంబంధించిన ప్రతి విషయాలను ఎప్పటికప్పుడూ.. తమ వినియోగదారులకు అందిస్తూ… వారికి నిత్యం అందుబాటులో ఉంటూ వస్తుంది. అందుకే ప్రజలలో ఇప్పటికీ ఎల్ఐసీ పై ఎక్కువగానే నమ్మకం ఉంది. అందుకే ఎల్ఐసీ అకౌంట్ తీసుకునేవారు చాలా మందే ఉన్నారు. అయితే తాజాగా ఈ సంస్థ వారి పాలసీదారులను హెచ్చరిస్తోంది.. మోసగాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తుంది.

ఇటీవల సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాంక్ ఖాతాదారుల పై మాత్రమే కాకుండా.. ఇప్పుడు వారి కన్ను ఎల్ఐసీ పాలసీదారులపై పడింది. ఎల్ఐసీ పాలసీదారులను టార్గెట్ చేస్తూ.. డబ్బులు కొట్టేస్తున్నారు. అందువలన మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే మోసపోవాల్సి వస్తుందని ఎల్ఐసీ అప్రమత్తం చేస్తోంది. ఎల్ఐసీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. మోసగాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని తమ కస్టమర్లను అలర్ట్ చేసింది. మోసగాళ్లు ఎల్ఐసీ ఏజెంట్లు లేదా అధికారులమని ఫోన్ చేస్తారని.. వారితో జాగ్రత్తగా ఉండాలని కోరింది. అలాగే ఐఆర్‏డీఏఐ అధికారులమని కూడా ఫోన్ కాల్స్ రావొచ్చని పేర్కొంది. పాలసీలు తీసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ పొందవచ్చని చెప్పి మోసం చేస్తారని వివరించింది. పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఎల్‌ఐసీ సైట్‌కు వెళ్లి వివరాలు చెక్ చేసుకోవాలని కోరింది.

ట్వీట్..

Also Read:  ‘ఆర్ఆర్ఆర్’ యాక్షన్ సన్నివేశాలకు నాకు కన్నీళ్లు వచ్చాయి.. వాటిలో ఒక రకమైన బాధ దాగి ఉంది.. విజయేంద్రప్రసాద్..

INTER ADMISSIONS: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫస్ట్ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. జూన్ 1 నుంచి ఆన్‌లైన్ క్లాసులు

విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్టూడెంట్స్ కోసం తక్కువ వడ్డీకే లోన్స్ అందిస్తున్న బ్యాంకులు.. ఏ ఏ బ్యాంకులంటే..