LIC Arogya Rakshak: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే పాలసీ.. ఒక్కపాలసీతో ఇంట్లో వారందరికి బెనిఫిట్స్‌..!

|

Aug 24, 2021 | 10:01 PM

LIC Arogya Rakshak: ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..

LIC Arogya Rakshak: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే పాలసీ.. ఒక్కపాలసీతో ఇంట్లో వారందరికి బెనిఫిట్స్‌..!
Lic Arogya Rakshak
Follow us on

LIC Arogya Rakshak: ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వినియోగదారుల కోసం ఎన్నో పాలసీలను ప్రవేశపెడుతోంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలు పొందే విధంగా అన్ని రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువస్తోంది. గతంలో పాలసీలు పెద్దగా చేసుకోలేని వారు .. కరోనా మహమ్మారి తర్వాత బీమా పాలసీలు చేసుకునే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఇక ఎల్‌ఐసీపై ప్రజల్లో ఇప్పటికీ నమ్మకం చెక్కుచెదరలేదు. ఎల్‌ఐసీ ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. ఇప్పుడు తాజాగా కొత్త ప్లాన్ తీసుకువచ్చింది. అదే ఆరోగ్య రక్షక్ పాలసీ. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, రెగ్యులర్ ప్రీమియం, ఇండివీజ్యూవల్‌ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. అనారోగ్యం సంభవించినప్పుడు ఈ పాలసీ వల్ల ప్రయోజనం పొందవచ్చు. పలు రకాల వ్యాధులకు పాలసీ కవరేజ్ వర్తిస్తుంది.

సాధారణంగా కాంప్రహెన్సిల్ హెల్త్ పాలసీలు బీమా చేసిన మొత్తం పరిమితి వరకు వైద్య చికిత్సకు అయ్యే వాస్తవ ఖర్చును తిరిగి చెల్లిస్తాయి. కానీ ఎల్‌ఐసీ తీసుకువచ్చిన ఈ కొత్త పాలసీ వైద్య చికిత్స ఖర్చులతో సంబంధం లేకుండా బీమా చేసిన మొత్తానికి సమానమైన పూర్తి ప్రయోజనాన్ని చెల్లిస్తుంది.

ఒక్క పాలసీతో ఇంట్లో వారందరికీ..

కాగా, ఎల్‌ఐసీ తీసుకువచ్చిన ఈ పాలసీతో ఎంతో బెనిఫిట్‌ ఉంది. ఈ ఒక్క పాలసీతో ఇంట్లోని వారందరికీ కవరేజ్ వర్తిస్తుంది. పిల్లలకు 25 ఏళ్లు వచ్చే వరకు, పాలసీదారుడికి 80 ఏళ్లు వచ్చే వరకు పాలసీ వర్తిస్తుంది. 18 నుంచి 65 ఏళ్లలోపు వయసు కలిగిన వారు పాలసీ తీసుకోవచ్చు. నో క్లెయిమ్ బెనిఫిట్, ఆటో స్టెప్ అప్ ద్వారా హెల్త్ కవర్ పెంచుకోవచ్చు. అంతేకాకుండా అంబులెన్స్ ఫెసిలిటీ, హెల్త్ చెకప్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ లేదా సమీపంలో ఉన్న బ్రాంచ్‌ను సంప్రదించవచ్చు.

ఇవీ కూడా చదవండి:

LIC Policy: ఎల్‌ఐసీలో అదిరిపోయే పాలసీ.. రూ.40 పొదుపుతో.. ఏటా రూ.40 వేలు పొందవచ్చు..!

LIC Policy: ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. రద్దయిన పాలసీలను పునరుద్దరించేందుకు ఆలస్య రుసుములో మినహాయింపు!