LIC: ప్రతీ నెల రూ. 10 వేలు రిటర్న్స్‌ కావాలా.. ఎల్‌ఐసీ తెచ్చిన ఈ కొత్త పథకం మీకోసమే..

|

Dec 20, 2022 | 7:26 PM

పదవి విరమణ చేసిన తర్వాత నిర్ధిష్టమైన ఆదాయం రావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల పథకాల్లో చేరుంతుంటారు. మీలాంటి వారి కోసమే ప్రముఖ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ అదిరిపోయే స్కీమ్‌ను తీసుకొచ్చింది. రిటైర్‌మెంట్ తర్వాత మంచి ఆదయాన్ని పొందేందుకు..

LIC: ప్రతీ నెల రూ. 10 వేలు రిటర్న్స్‌ కావాలా.. ఎల్‌ఐసీ తెచ్చిన ఈ కొత్త పథకం మీకోసమే..
LIC
Follow us on

పదవి విరమణ చేసిన తర్వాత నిర్ధిష్టమైన ఆదాయం రావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల పథకాల్లో చేరుంతుంటారు. మీలాంటి వారి కోసమే ప్రముఖ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ అదిరిపోయే స్కీమ్‌ను తీసుకొచ్చింది. రిటైర్‌మెంట్ తర్వాత మంచి ఆదయాన్ని పొందేందుకు న్యూ జీవన్‌ శాంతి పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా జీవితాంతం పెన్షన్‌ను పెందొచ్చు. ఇంతకీ ఈ స్కీ్‌మ్‌లో ఎంత పెట్టుబడి పెట్టాలి.? నెలకు ఎంత పొందొచ్చు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఎల్‌ఐసీ న్యూ జీవన్‌ శాంతి పథకంలో రెండు రకాల పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. మొదటిది ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్ రెండోది డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. ఇంటర్మీడియట్ యాన్యుటీ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రీమియం చెల్లించిన తర్వాతే పెన్షన్ సౌకర్యం పొందుతారు. కానీ డిఫర్డ్ యాన్యుటీ ఆప్షన్‌లో పాలసీలో మాత్రం 1, 5, 10, 12 సంవత్సరాల తర్వాత మీకు పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. ఈ ప్లాన్‌లో మీరు అర్థ వార్షిక, త్రైమాసిక, నెలవారీ ప్రాతిపదికన పెన్షన్ పొందొచ్చు. ఈ ప్లాన్‌లో కనీసం రూ. 1.50 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబడికి పరిమితి అంటూ ఏం లేదు. ప్లాన్‌లో చేరడానికి కనీస వయసు 30, గరిష్ట వయసు 79 ఏళ్లు ఉండాలి.

పాలసీని తీసుకున్న తర్వాత కూడా సరెండర్ చేయొచ్చు. పాలసీపై రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. జీవన్ శాంతి ప్లాన్‌లో సింగిల్, జాయింట్ పాలసీని ఎంపి చేసుకోవచ్చు. ఒక వేళ పాలసీదారు మరణిస్తే డిపాజిట్ మొత్తం నామినీకి ఇస్తారు. ఇక ఉమ్మడి పాలసీలో పాలసీదారుడు మరణిస్తే పెన్షన్‌ ప్రయోజనం రెండో వ్యక్తికి అందిస్తారు. ఒకవేళ ఇద్దరూ చనిపోతే డిపాజిట్ చేసిన మొత్తాన్ని నామినీకి అందిస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఎల్‌ఐసీ న్యూ జీవన్‌ శాంతి పాలసీలో సింగిల్ లైఫ్ ప్లాన్ కోసం 45 సంవత్సరాల వయస్సులో డిఫర్డ్ యాన్యుటీలో 12 సంవత్సరాల వ్యవధికి రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టారనుకుందాం. దీంతో పాలసీదారుడు ప్రతీ ఏటా రూ. 1,20,700 పొందుతారు. అంటే నెలకు రూ. 9,656 పెన్షన్‌ను పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..