LIC Childrens Plan: మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా..? ఇదే అద్భుతమైన పాలసీ

|

Mar 27, 2021 | 8:02 PM

LIC Childrens Plan: ఈ మధ్య కాలంలో ప్రజలకు మరిన్ని బెనిఫిట్స్‌ కల్పించేందుకు భారత ప్రభుత్వ రంగ లైఫ్‌ ఇన్స్‌రెన్స్‌ కార్పొరేషన్‌ LIC) కొత్త ఇన్స్‌రెన్స్‌ పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది...

LIC Childrens Plan: మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా..? ఇదే అద్భుతమైన పాలసీ
Lic Childrens Plan
Follow us on

LIC Childrens Plan: ఈ మధ్య కాలంలో ప్రజలకు మరిన్ని బెనిఫిట్స్‌ కల్పించేందుకు భారత ప్రభుత్వ రంగ లైఫ్‌ ఇన్స్‌రెన్స్‌ కార్పొరేషన్‌ LIC) కొత్త ఇన్స్‌రెన్స్‌ పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. గతంలో పాలసీలు చేసుకునేవారి సంఖ్య పెద్దగా లేకపోయినా.. కరోనా కారణంగా పాలసీలు చేసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో తాజాగా న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ అందిస్తోంది. ఈ పాలసీని పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించింది ఎల్ఐసీ. పిల్లల చదువు, పెళ్లిళ్లు, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పాలసీని తీసుకువచ్చింది. ఇది నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, లైఫ్ ఇన్స్యూరెన్స్, సేవింగ్స్ ప్లాన్. పిల్లలు పుట్టిన వెంటనే ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీసం రూ.1,00,000 సమ్ ఇన్స్యూర్డ్‌తో ఈ పాలసీని తీసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. పిల్లల తల్లిదండ్రులు లేదా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు పిల్లల పేరుపై ఈ పాలసీని తీసుకునే సదుపాయం ఉంది. అయితే రూ.1,00,000 సమ్ అష్యూర్డ్‌తో 0 ఏళ్లు ఉన్న పిల్లలకు రూ.4327 ప్రీమియం చెల్లించాలి. ఐదేళ్లు ఉన్న పిల్లలకు రూ.5586 ప్రీమియం, 10 ఏళ్లు ఉన్న పిల్లలకు రూ.7899 ప్రీమియం, 15 ఏళ్లు ఉన్న పిల్లలకు రూ.9202 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ఎల్‌ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 0 ఏళ్లు. గరిష్ట వయస్సు 12 ఏళ్లు. మెచ్యూరిటీ వయస్సు 25 ఏళ్లు. పిల్లలకు 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పాలసీ గడువు ఉంటుంది. అయితే పాలసీ ప్రీమియంను సంవత్సరం, 6 నెలలు, 3 నెలలకోసారి, నెలకోసారి చెల్లించే వెలుసుబాటు ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న పిల్లలకు వారి వయసు 18, 20, 22 ఏళ్లు ఉన్నప్పుడు 20 శాతం చొప్పున మనీ బ్యాక్ వస్తుంది. మూడు వాయిదాల్లో 20 శాతం చొప్పున 60 శాతం మనీ బ్యాక్‌ ఇచ్చారు కాబట్టి 40 శాతం మెచ్యూరిటీ తర్వాత బోనస్‌తో కలిపి వస్తుంది. అయితే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో పాలసీదారుడు మృతి చెందినట్లయితే సమ్ అష్యూర్డ్, బోనస్ కలిపి ఇస్తుంది. అయితే ఒక వేళ ఈ పాలసీ తీసుకున్న తర్వాత నచ్చకపోయినట్లయితే 15 రోజుల్లోగా వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ పాలసీపై రుణ సదుపాయం కూడా ఉంటుంది. ఇక ప్రీమియం చెల్లించేందుకు ఆలస్యం అయినట్లయితే 15 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది. అలాగే ఎల్‌ఐసీ ప్రీమియం వేవర్‌ బెనిఫిట్‌ రైడర్‌ తీసుకుంటే పాలసీ ప్రపోజర్‌ అంటే పిల్లల పేరుతో పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రీమియం చెల్లిస్తున్న కాలంలో మరణిస్తే ఆ తర్వాత చెల్లించాల్సిన ప్రీమియంలను మాఫీ చేస్తుంది.అంటే ప్రీమియంలు చెల్లించకపోయినా పిల్లలకు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు పాలసీ కొనసాగుతుంది. మనీ బ్యాక్‌ కూడా వస్తుంది. ఈ పాలసీ రైడర్‌ ఆప్షన్స్‌ కూడా ఉన్నాయి. ఇక పాలసీ మూడేళ్లు పూర్తయిన తర్వాత సరెండర్‌ చేయవచ్చు.

ఇవీ చదవండి: Credit Card: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా…? రివార్డు పాయింట్లను ఎలా వాడాలి..? వాటి విలువ ఎంత..?

PM Kisan Samman Nidhi: రైతులకు డబుల్‌ బెనిఫిట్స్‌.. మార్చి 31లోగా చేరండి.. బ్యాంకు ఖాతాలో రూ.4 వేలు పొందండి

Provident Fund (PF): ఉద్యోగులు అలర్డ్‌.. మీరు ఈ పనులు చేయకపోతే పీఎఫ్‌ డబ్బులు తీసుకోలేరు

Health Check-up Benefits: మార్చి 31లోపు ఇలా చేయండి.. రూ.50 వేల వరకు ప్రయోజనం పొందే అవకాశం..!

Credit Card Limit: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా..? కార్డు లిమిట్‌ పెంచుకుంటే లాభమా… నష్టమా..?