LIC Jeevan Tarun Policy: మీ పిల్లల కోసం ఎల్‌ఐసీలో అద్భుతమైన పాలసీ.. రోజుకు రూ.150 పెట్టుబడితో చేతికి రూ.8.44 లక్షలు

పిల్లల పుట్టుకతో తల్లిదండ్రులు అతని భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడం ప్రారంభిస్తారు. మీరు కూడా మీ పిల్లల చదువు ఖర్చుల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే ఎల్‌ఐసీలో ఎన్నో..

LIC Jeevan Tarun Policy: మీ పిల్లల కోసం ఎల్‌ఐసీలో అద్భుతమైన పాలసీ.. రోజుకు రూ.150 పెట్టుబడితో చేతికి రూ.8.44 లక్షలు

Updated on: Jan 14, 2023 | 9:04 PM

పిల్లల పుట్టుకతో తల్లిదండ్రులు అతని భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడం ప్రారంభిస్తారు. మీరు కూడా మీ పిల్లల చదువు ఖర్చుల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే ఎల్‌ఐసీలో ఎన్నో అద్భుతమైన పాలసీలు ఉన్నాయి. పాలసీల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మెచ్యూరిటీ సమయంలో మంచి లాభాలు పొందవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీ పెట్టుబడిదారుల కోసం అనేక విభిన్నమైన పాలసీలను అందజేస్తూనే ఉంది. ఇక ఎల్‌ఐసీ అందిస్తున్న పాలసీల్లో జీవన్ తరుణ్ పాలసీ ఒకటి. ఈ పాలసీ ప్రత్యేకంగా పిల్లల కోసం రూపొందించారు. ఈ పాలసీ నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్ ప్లాన్. ఇది పిల్లల విద్య, ఇతర సంబంధిత ఖర్చుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.

ఈ స్కీమ్‌లో మీరు 20 సంవత్సరాల ప్రీమియం చెల్లించడం ద్వారా 25 సంవత్సరాల పాటు కవర్ ప్రయోజనం పొందుతారు. ఈ పథకంలో మీరు కనిష్టంగా రూ. 75,000 నుండి గరిష్టంగా ఏ మొత్తానికి అయినా బీమా హామీ మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకంలో మీరు ప్రీమియంను నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక ప్రాతిపదికన డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి పిల్లల వయస్సు కనీసం 90 రోజులు ఉండాలి.

ఈ ప్లాన్‌ను గరిష్టంగా 12 సంవత్సరాల పిల్లల కోసం కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో పిల్లల వయస్సు 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ మొత్తం అందుతుంది. జీవన్ తరుణ్ పాలసీలో ప్రతిరోజూ రూ.150 ఇన్వెస్ట్ చేస్తే, వార్షిక ప్రీమియం రూ.54000 అవుతుంది. అంటే 8 సంవత్సరాలలో మీ పెట్టుబడి రూ.4,32000 అవుతుంది. దీనితో పాటు, మీరు పెట్టుబడిపై రూ. 2,47,000 బోనస్ కూడా పొందుతారు. ఈ పాలసీ హామీ మొత్తం రూ.5 లక్షలు. దాని తర్వాత మీరు లాయల్టీ బోనస్‌గా రూ.97000 పొందుతారు. ఈ విధంగా మీరు ఈ పాలసీ కింద రూ.8,44,550 పొందుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us