Central Government: మహిళల కోసం కేంద్రం అద్భుత పథకం.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.7 వేలు.. జస్ట్ దరఖాస్తు చేసుకుంటే చాలు..

మహిళలకు కేంద్ర ప్రభుత్వం అద్బుత అవకాశం కల్పిస్తోంది. ఎల్‌ఐసీ ఏజెంట్‌గా చేరి ఆదాయం పొందేందుకు కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అదే ఎల్‌ఐసీ బీమా సఖీ యోజన. ఈ పథకంలో ద్వారా ఎలా మహిళలు లబ్ది పొందాలి..? దరఖాస్తు చేసుకోవడం ఎలా? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

Central Government: మహిళల కోసం కేంద్రం అద్భుత పథకం.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.7 వేలు.. జస్ట్ దరఖాస్తు చేసుకుంటే చాలు..
Lic

Updated on: Jun 18, 2026 | 10:51 AM

ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) మహిళలకు శుభవార్త అందించింది. మహిళల కోసం బీమా సఖి యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా మహిళలు నెలకు రూ.7 వేల వరకు ఆదాయం పొందవచ్చు. ఎల్‌ఐసీ ఏజెంట్లుగా మహిళలకు అవకాశం కల్పించేందుకు కేంద్రం ఈ స్కీమ్ లాంచ్ చేసింది. ఈ స్కీమ్ ద్వారా మహిళలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇన్యూరెన్స్ ప్రొడక్ట్స్, బీమా సేవలు, ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన కల్పిస్తారు. అనంతరం ఎల్‌ఐసీ ఏజెంట్లుగా అవకాశ కల్పించారు. మూడేళ్ల పాటు స్ట్రైఫండ్ అందజేస్తారు.

నెలకు రూ.7 వేలు

మూడేళ్ల పాటు నెలకు రూ.7 వేలు స్ట్రైఫండ్ అందించడంతో పాటు ఎల్‌ఐసీ పాలసీలు విక్రయిస్తే వాటిపై కమిషన్ కూడా పొందవచ్చు. ఈ పథకంలో చేరాలంటే వయస్సు 18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి. 10వ తరగతి పాసై ఉండాలి. ఇప్పటికే ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పని చేసి ఉండకూడదు. ఇక ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఏజెంట్ల కుటుంబసభ్యులు, బంధువులు దీనికి అనర్హులు. ముందుగా ఐఆర్‌డీఏఐ పరీక్షలు ఉత్తీర్ణణ సాధించాల్సి ఉంటుంది. అనంతరం ఏజెంట్‌గా అవకాశం కల్పిస్తారు. ఉద్యోగంలో చేరాక తొలి ఏడాది నెలకు రూ.7 వేల స్ట్రైఫండ్ ఉంటుంది. ఆ తర్వాత రెండో ఏడాది నెలకు రూ.6 వేలు, మూడో ఏడాది రూ.5 వేలు ఉంటుంది. స్ట్రైఫండ్ కాకుండా పాలసీలు చేయిస్తే వాటిపై కమిషన్ అందుతుంది.

మూడేళ్ల తర్వాత ఏమవుతుంది..?

ఇక మూడేళ్ల తర్వాత కూడా స్ట్రైఫండ్ పొందాలంటే ఎల్‌ఐసీ నిర్దేశించి కొన్ని వ్యాపార, పాలసీ పనితీరు లక్ష్యాలను సాధించి ఉండాలి. ఇంట్లోనే ఉండి ఈ ఉద్యోగం చేసుకోవచ్చు. కార్యాలయలకు వెళ్లాల్సిన పని కూడా ఉండదు. ఎల్ఐసీ ఇండియా వెబ్‌సైట్లోకి వెళ్లి ఈ పథకంలో అర్హత పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్, విద్యార్హత సర్టిఫికేట్లు, అడ్రస్ ప్రూఫ్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, మొబైల్ నెంబర్, బ్యాంక్ వివరాలు అందించాలి. అనంతరం మీ దరఖాస్తు అధికారుల దృష్టికి వెళుతుంది. అధికారులు పరిశీలించి మీ అర్హతలను నిర్దారిస్తారు. మీకు అన్ని అర్హతలు ఉంటే వెంటనే ఫోన్ లేదా మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. అనంతరం ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ పూర్తయ్యాక ఎల్ఐసీ ఏజెంట్‌గా అవకాశం కల్పిస్తారు. అనంతరం మీరు పాలసీలను విక్రయించాల్సి ఉంటుంది. స్ట్రైఫండ్ కాకుండా అదనంగా పాలసీలు విక్రయించినందుకు కమిషన్ అందిస్తారు. ఇంట్లోనే ఉండి పాలసీలు విక్రయిస్తూ ఆదాయం పొందాలనుకునే మహిళలకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.

Follow Us