LPG Gas Price: వినియోగదారురులకు శుభవార్త.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర!

LPG Gas Cylinder Price: ప్రతి నెల 1వ తేదీన పలు విభాగాలలో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. అలాగే ప్రతి నెల కూడా గ్యాస్ సిలిండర్‌ ధరలు అప్‌డేట్‌ చేస్తుంటాయి ఆయిల్‌ కంపెనీలు. అలాగే నవంబర్‌ 1వ తేదీన గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గింది. మరి ఎంత తగ్గింది? ఏ నగరాల్లో ఎంత ఉందో తెలుసుకుందాం..

LPG Gas Price: వినియోగదారురులకు శుభవార్త.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర!

Updated on: Nov 01, 2025 | 7:06 AM

ప్రతి నెల 1 తేదీన గ్యాస్సిలిండర్ధరలలో మార్పులు జరుగుతుంటాయి. అలాగే నవంబర్‌ 1 తేదీన కూడా గ్యాస్సిలిండర్ధరలో మార్పులు జరిగాయి. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్‌పై కొంత ఉపశమనం కల్పించాయి కంపెనీలు. దాని ధరను ఐదు రూపాయలు తగ్గించింది. 14 కిలోల గృహ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులేదు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం..ఢిల్లీలో, 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1,590.50 ఉంది. గతంలో రూ.1,595.50 నుండి తగ్గింది. కోల్‌కతాలో దాని ధర ఇప్పుడు రూ.1,694, ముంబైలో రూ.1,542, చెన్నైలో రూ.1,750. హైదరాబాద్లో రూ.1,812.50 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు పెరిగాయని, డాలర్ విలువ కూడా తగ్గిందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రైతులకు గుడ్‌న్యూస్‌.. ఎకరాకు రూ.10 వేలు

ఇవి కూడా చదవండి

గృహ వినియోగ LPG సిలిండర్ల ధరలో ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయలేదు. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో వంట గ్యాస్ ధర రూ.850 నుంచి రూ.960 మధ్య ఉంటుంది. ప్రస్తుతం దేశీయ ఎల్పీజీ సిలిండర్ ఢిల్లీలో రూ.853, ముంబైలో రూ.852.50, హైదరాబాద్లో రూ.905 ఉందికాగా, గత నెలలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.16 పెంచింది. అక్టోబర్ 1న ఢిల్లీలో దాని ధర రూ.1,580 నుంచి రూ.1,595కి పెరిగింది.

ఇది కూడా చదవండి: Business Idea: కోటీశ్వరులు కావాలనుకుంటే ఈ మొక్కలను నాటండి.. ఎకరాకు కోటి రూపాయలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి