
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన కోటమ్ మహీంద్రా బ్యాక్ తమ కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. డిసెంబర్ 21న ఆన్‌లైన్ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయని తెలిపింది. ఆ రోజున ఉదయం 3.30 గంటల నుంచి 4.30 గంటలకు వరకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయని కస్టమర్లకు సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. మెయింటెనెన్స్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీని వల్ల ఏయే సేవలు నిలిచిపోతాయనేది కూడా ప్రకటనలో వివరించింది. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
కోటక్ బ్యాంక్ పాత యాప్ పనిచేయదు. ఇక కొత్త యాప్ కూడా వర్క్ అవ్వదు. అలాగే కోటక్ 811 అప్లికేషన్ సేవలు కూడా నిలిచిపోతాయి. ఇక నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవలు కూడా నిలిచిపోతాయి. ఇక ఇతర అనుబంధ అన్‌లైన్ సేవలు కూడా ఆగిపోతాయి. అయితే రూ.20 వేలకు తక్కువగా ఉండే ఏటీఎం ట్రాన్సాక్షన్లపై ప్రభావం ఉండదని కోటక్ మహీంద్రా బ్యాంక్ స్పష్టం చేసింది. కస్టమర్లు ముందే అలర్ట్ అయి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అవసరమైన సేవలు ముందే పొందాలని పేర్కొంది. నాణ్యమైన సేవలు అందించేందుకు బ్యాంకింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది.
ఇక హెచ్‌డీఎఫ్‌సీ ఆన్‌లైన్ సేవలు ఈ నెల 21వ తేదీన అర్థరాత్రి 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిలిచిపోతున్నాయి. ఆన్‌లైన్ సేవలైన యూపీఐ, నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్ కానున్నాయి. మెయింటెనెన్స్ కారణంగా సేవల్లో అంతరాయం ఏర్పడనుంది.