
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ కొమకి కొత్త త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంఛ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఫ్యామిలీ అంతా ప్రయాణించొచ్చు. ఇది చూడ్డానికి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సిటీలో పిల్లలతో కలిసి ఫ్యామిలీ అంతా తిరిగేందుకు వీలుగా ఈ త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూపొందించారు. పైగా దీని ధర కూడా తక్కువే. ఈ స్కూటర్ గురించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.
కొమకి ఫ్యామ్ 1.0, ఫ్యామ్ 2.0 పేర్లతో మార్కెట్లోకి రెండు త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంఛ్ అయ్యాయి. ఇందులో ప్రత్యేకమైన లిథియం పాలిమర్ బ్యాటరీలను అమర్చారు. ఈ బ్యాటరీలను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. ఫ్యామ్ 1.0 స్కూటర్.. 100 కిలోమీటర్లు, ఫ్యామ్ 2.0 స్కూటర్ 200 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలవు. ఇవి లిథియం అయాన్ కు భిన్నంగా తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తూ వేగంగా ఛార్జ్ అవుతాయి.
ఇకపోతే ఈ స్కూటర్లలో మోడ్రన్ సెన్సర్లు ఉన్నాయి. ఆటో సెల్ఫ్-డయాగ్నోసిస్ సిస్టమ్ కూడా ఉంది. ఇది ఏదైనా సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించి వార్నింగ్ ఇస్తుంది. రివర్స్ డ్రైవ్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది. ఇరుకైన చోట్ల సులభంగా వాహనాన్ని వెనక్కి తిప్పుకోవడానికి వీలవుతుంది. అలాగే ఇందులో మల్టిపుల్ గేర్ మోడ్లు ఉంటాయి. ఆటో హోల్డ్ బ్రేక్ సిస్టమ్, స్మార్ట్ డాష్‌బోర్డ్, రియల్-టైమ్ డేటా, నావిగేషన్, కాల్ అలర్ట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇకపోతే ఈ స్కూటర్లు 3 టైర్లపై నడుస్తాయి. 80 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఫ్యామిలీ ట్రిప్స్ కే కాకుండా బిజినెస్ పరంగా కూడా వీటిని వాడుకోవచ్చు. ఇవి ఒకరకంగా తక్కువ ధరలో కారు లాంటి బెనిఫిట్స్ ను అందిస్తాయి. ఇక ధరల విషయానికొస్తే.. కోమకి ఫ్యామ్ 1.0 ఎక్స్-షోరూమ్ ధర రూ.99,999, కోమకి ఫ్యామ్ 2.0 స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,26,999గా ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి