Indian Railways: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, దక్షిణ మధ్య రైల్వే 2023లో సాధించిన అద్భుతమైన విజయాలు ఇవే

|

Jan 04, 2024 | 6:18 PM

రైల్వే నెట్‌వర్క్‌ పరిధిలో అక్రమ కార్యకలాపాలను ఆరికట్టడానికి చేసే ప్రయత్నాలలో భాగముగా రూ. 23,09,47,065 విలువైన 3293 కిలోల గంజాయిని రవాణా చేసినందుకు 161 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ దృఢమైన చర్య చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అరికట్టడమే కాకుండా ప్రజల భద్రతకు ముప్పు కలిగించే నేరాలను పరిష్కరించడంలో రైల్వే రక్షణ దళం కీలక పాత్ర పోషిస్తో్ంది. బెల్లం రవాణాను అరికట్టేందుకు..

Indian Railways: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, దక్షిణ మధ్య రైల్వే 2023లో సాధించిన అద్భుతమైన విజయాలు ఇవే
Indian Railway Protection Force
Follow us on

రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యాలను కల్పించడమే కాకుండా నేరాలకు పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా పెడుతోంది. రైల్వే స్టేషన్‌లలో, ట్రాక్‌లపై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రైల్వే రక్షణ దళం, దక్షిణ మధ్య రైల్వే కొరడా ఝులిపిస్తోంది.  ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతూ అందరి మన్ననలు అందుకుంటోంది. టికెట్‌ లేకుండా ప్రయాణించడం, ట్రాక్‌పై నడవడం, స్టేషన్‌లలో అనుమానితులపై నిఘా వేయడం, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం వంటి వాటిపై రైల్వే రక్షణ దళం ప్రత్యేక చర్యలు చేపట్టి వారిని అరెస్టు చేస్తూ భారీ ఎత్తున జరిమానాలను విధిస్తోంది. జోన్‌ల పరిధిలో జరుగుతున్న నేరాలపై ప్రత్యేక నిఘా వేస్తూ వాటిన అరికడుతోంది.

2023 సంవత్సరంలో రైల్వే రక్షణ దళం, దక్షిణ మధ్య రైల్వే ఎన్నో విజయాలను సాధించింది. రక్షణ దళం, దక్షిణ మధ్య రైల్వే తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళం 2023 సంవత్సరంలో జోన్ పరిధిలో నేరాల నివారణకు నిరంతర కృషి చేస్తూ అంకితభావాన్ని ప్రదర్శించింది. రైల్వే ఆస్తులు , ప్రయాణికుల రక్షణ, భద్రతను కాపాడుటలో నిరంతరం అలుపెరగని స్థిరమైన నిబద్ధతతో తిరుగులేని సంకల్పాన్ని ప్రదర్శించింది. వారి సమగ్ర ప్రయత్నాలు, నేర కార్యకలాపాలను పరిష్కరించడానికి, అరికట్టడానికి చురుకైన విధానాన్ని అవలంబిస్తూ రైల్వే వినియోగదారులందరికి సురక్షితమైన వాతావరణాన్ని పెంపొందించాయి.

రిజర్వేషన్‌ టికెట్లను అనధికారికంగా విక్రయించినందుకు..

2023 సంవత్సరంలో రైల్వే రిజర్వేషన్ టిక్కెట్లను అనధికారికంగా విక్రయించినందుకు మొత్తం 261 మందిని అరెస్టు చేసి రూ. 2,30,59,680  విలువ చేసే 8770 టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ  టికెటింగ్ కార్యకలాపాలను అరికట్టడమే కాకుండా, రైల్వే పరిధిలో టికెటింగ్ వ్యవస్థ సమగ్రతను, ఆర్థిక ప్రయోజనాలను కాపాడటంలో రైల్వే రక్షక దళం సమర్థవంతమైన పాత్ర పోషించింది. రైల్వే రక్షణ దళం అంకిత ప్రయత్నాల వలన  రైల్వే ప్రాంగణంలో శాంతిభద్రతలను అమలు చేసే రంగంలో గణనీయమైన ఫలితాలను సాధించింది. ఫలితంగా, రైల్వే ప్రాంగణంలో ట్రేస్ పాసింగ్(అనధికారిక కదలికలు) చేసినందుకుగాను 28,778 మంది వ్యక్తులను పట్టుకుని రూ.25,77,700  జరిమానా రూపంలో వసులు చేశారు. ఈ చర్య రైల్వే పరిసరాల పవిత్రత, భద్రతను నిర్వహించడానికి పటిష్టమైన విధానాన్ని సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి

728మంది అనుమానితుల అరెస్ట్‌

ప్రయాణికుల భద్రతకు అపాయం కలిగించే 728 మంది అనుమానిత వ్యక్తులను అరెస్టు చేసి రూ.10,28,100 జరిమానా విధించడంతో ప్రయాణికుల భద్రతపై వారికి కలిగే ఆందోళనలను దూరం చేయ గలిగింది.  అలాగే అధికారిక టికెట్ లేకుండా రిజర్వ్ చేయబడిన కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించినందుకుగాను 702 మంది అనధికారిక వ్యక్తులను గుర్తించి వారి వద్దనుండి  రూ.1,47,000 జరిమానా రూపంలో  వసులు చేశారు.  దీనితోపాటు ఫుట్‌బోర్డ్‌లపై ప్రయాణించినందుకు 627 మందిని పట్టుకున్నారు. అలాగే టిక్కెట్ లేకుండా ప్రయాణించినందుకు 1903 మందిని బుక్ చేయడంతో పాటు రూ .1,35,750 జరిమానా విధించారు. రైలులో మహిళా ప్రయాణికులకు కేటాయించబడిన స్థలాలను వారి కోసమే పరిరక్షించడంపై దృష్టి సారించి, మహిళా కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించినందుకు 835 మంది పురుష ప్రయాణికులను నిర్బంధించి రూ.1,53,400 జరిమానా విధించారు. తద్వారా మహిళకు నియమించబడిన వసతిని గౌరవించడం, వాటికై  పాటించాల్సిన నియమాల అవసరం గురించి స్పష్టమైన సందేశాన్ని పంపారు.

రైల్వే ప్రాంగణంలో చెత్త వేసేవారిపై జరిమానా

రైల్వే ప్రాంగణంలో ధూమపానాన్ని ఆరికట్టే చర్యలలో భాగంగా1,586 మందిని పట్టుకుని రూ.1,38,500 జరిమానా విధించారు. అదే విధంగా రైల్వే ప్రాంగణంలో చెత్తవేసే 18,002 మందిని పట్టుకుని రూ.37,23,400 జరిమానా విధించారు. అదనంగా సీఓటీపీఏ (సిగరెట్ అండ్‌ అదర్ టోబాకో ఆక్ట్ )కింద 11,437 మంది వ్యక్తుల నుంచి రూ.19,41,600 జరిమానా మొత్తం వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. అంతే కాకుండా రైళ్లలో ప్రమాదకరమైన/పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్న 19 మందిని అరెస్టు చేశారు.

ఆస్తుల పరిరక్షణలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తిరుగులేని నిబద్ధత:

రైల్వే ఆస్తుల పరిరక్షణలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తిరుగులేని నిబద్ధతకు నిదర్శనంగా, రైల్వే ఆస్తులను అక్రమంగా ఆక్రమించినందుకు గాను మొత్తం 693 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. అలాగే రూ.1,97,21,178 విలువైన రైల్వే ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నడుస్తున్న రైళ్లపై రాళ్లు రువ్వినందుకు 401 కేసులు నమోదు చేసి 327 మందిని అరెస్టు చేశారు.

అక్రమ మద్యంపై రవాణాపై చర్యలు:

రైల్వే నెట్‌వర్క్‌ పరిధిలో అక్రమ కార్యకలాపాలను ఆరికట్టడానికి చేసే ప్రయత్నాలలో భాగముగా రూ. 23,09,47,065 విలువైన 3293 కిలోల గంజాయిని రవాణా చేసినందుకు 161 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ దృఢమైన చర్య చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అరికట్టడమే కాకుండా ప్రజల భద్రతకు ముప్పు కలిగించే నేరాలను పరిష్కరించడంలో రైల్వే రక్షణ దళం కీలక పాత్ర పోషిస్తో్ంది. బెల్లం రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక ప్రయత్నంగా రూ.3,94,87,700 విలువ చేసే 22,905 కిలోల బెల్లం స్వాధీనం చేసుకుని 66 మందిని అరెస్టు చేశారు . దీనితోపాటు అక్రమమద్యం రవాణాను ఆరికట్టే చర్యలో భాగముగా రూ. 28,65,427/- విలువ చేసే 5,429 మద్యం సీసాలను రవాణా చేసిన 88 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

వస్తువులను దొంగిలించిన 458 మంది అరెస్ట్‌:

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌) విధి నిర్వహణలో నిరంతర అప్రమత్తత ప్రదర్శించడం ద్వారా రైల్వే ప్రాంగణంలో ప్రయాణికుల వస్తువులను దొంగిలించిన 454 మంది నేరస్థులను పట్టుకుంది. ప్రయాణికుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి, నిబద్ధతకు నిదర్శనంగా, రూ.9,35,49,925 విలువైన వస్తువులు రైళ్లలో లేదా రైల్వే ప్రాంగణంలో అనుకోకుండా వదిలి వెళ్లిన ప్రయాణిలకు తిరిగి వారికి అందించారు. తద్వారా సానుకూల ప్రయాణ అనుభవాన్ని సులభతరం చేయడంలో ఆర్‌పీఎఫ్‌ అంకితభావాన్ని చూపించింది.

తప్పిపోయిన బాలబాలికలను తల్లిదండ్రులకు అప్పగింత:

రైల్వే ఆస్తులను పరిరక్షించడంతో పాటు, వ్యక్తుల శ్రేయస్సును నిర్ధారించడంలో ఆర్‌పీఎఫ్‌ నిబద్ధత రైళ్లు, రైల్వే ప్రాంగణాల నుంచి 1,115 మంది బాలురు, 228 మంది బాలికలను రక్షించడం వరకు విస్తరించింది. ఈ మైనర్‌లను వెంటనే వారి తల్లిదండ్రులతో కలపడం లేదా చైల్డ్ రెస్క్యూ హోమ్‌లకు అప్పగించడం జరిగింది.

ధైర్య సాహసాలలో ఆర్‌ఫీఎఫ్‌ సిబ్బంది:

ఇది కాకుండా ఆర్‌పిఎఫ్ సిబ్బంది విధి నిర్వహణలో ధైర్య సాహసాలను ప్రదర్శించడం ద్వారా రైల్వే ట్రాక్‌లపై ప్రాణాంతక ప్రమాదాల నుంచి 22 మంది వ్యక్తులను ప్రాణాపాయ స్థితి నుండి రక్షించ గలిగారు. ఈ సమిష్టి కృషి వలన రైల్వే ప్రయాణికుల భద్రత, శ్రేయస్సు, సానుకూల అనుభవాలను నిర్ధారించడంలో రైల్వే రక్షణ దళం విశేషమైన నిబద్ధతకు పదునైన నిదర్శనం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి