భారతదేశంలో బడ్జెట్ బైక్స్‌తో యువతను ఎంతగానో ఆకట్టుకునే సూపర్ బైక్స్ అమ్మకాలు ఇటీవ కాలంలో భారీగా పెరుగుతున్నాయి. మారుతున్న జీవన ప్రమాణాలకు తగినట్టుగా నలుగురిలో కొత్తదనంతో ఉండాలని కోరుకునే వారు ఈ సూపర్ బైక్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని కంపెనీలు సరికొత్త బైక్స్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా సూపర్ బైక్స్‌కు ఎంతగానో ప్రసిద్ధి చెందిన కవాసకీ ఇటీవల తన న్యూ వెర్షన్ బైక్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. కవాసకి నింజా 300 2024 వెర్షన్ సూపర్ లుక్‌తో రిలీజ్ చేసింది. ముఖ్యంగా ఈ బైక్‌లో మునుపెన్నడూ చూడని రంగుల్లో రిలీజ్ చేసి సూపర్ బైక్ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ బైక్ క్యాండీ లైమ్ గ్రీన్, మెటాలిక్ మూండస్ట్ గ్రే రంగులతో రిలీజ్ చేసిన 2024 వెర్షన్ బైక్ ధర రూ. 3.43 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో కవాసకీ నింజా 300 బైక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
కవాసకి నింజా 300 బైక్ పాత డిజైన్‌తో లాంచ్ చేసిన కొత్త వెర్షన్ కలర్స్ మాత్రం బైక్ లవర్స్‌ను కట్టి పడేస్తున్నాి. ఈ డిజైన్ నింజా 250 స్థానంలో మొదటిసారిగా 2013లో లాంచ్ చేసిన బైక్‌లా ఉంటుంది. అప్పటి నుంచి ఈ బైక్ అంతర్జాతీయ మార్కెట్‌లో నిలిపిసినా భారతదేశంలో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం నింజా 500తో భర్తీ చేసిన నింజా 400తో పాటు అమ్మకానికి ఉంది. కవాసకి నింజా 300 స్పోర్టీ ఔటర్ షెల్ హై-టెన్సైల్ స్టీల్‌తో తయారు చేసిన డైమండ్ ఫ్రేమ్ తో వస్తుంది.
కవాసకీ 300ఫ్రేమ్‌కు సపోర్టింగ్ ఫ్రంట్ ఎండ్లో 37 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్‌తో వస్తుంది. వెనుక భాగంలో 5 వే ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఉంది. బ్రేకింగ్ డ్యూయల్ పిస్టన్ కాలిపర్తో ఒకే 290 మిమీ డిస్క్ బ్రేక్‌తో వస్తుంది. వెనుక భాగంలో డ్యూయల్-పిస్టన్ కాలిపర్లతో ఒకే 220 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. కవాసకి నింజా 300 296 సీసీ , సమాంతర -ట్విన్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ బైక్ 38.88 బీహెచ్‌పీ శక్తిని, 26.1 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ యూనిట్ ఆరు-స్పీడ్ గేర్ బాక్స్ అసిప్ట్, స్లిప్పర్ క్లప్‌తో వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ బైక్ కేటీఎం ఆర్‌సీ 390, యమహా ఆర్3, టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310, బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ వంటి బైక్స్‌కు గట్టి పోటినివ్వనుంది. ముఖ్యంగా ధర విషయంలో మార్కెట్లో అత్యంత సరసమైన ట్విన్-సిలిండర్ ఇంజిన్ బైక్ లో ఒకటిగా ఈ బైక్ నిలిచింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి