Electric scooter: ఇండియన్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మరో హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతో తెలిస్తే!

| Edited By: Ravi Kiran

Jan 15, 2023 | 9:00 AM

జాయ్ ఈ- బైక్ కంపెనీ తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మిహోస్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు  2023 ఆటో ఎక్స్‌పోలో దీనిని ప్రదర్శించింది.

Electric scooter: ఇండియన్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మరో హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతో తెలిస్తే!
Joy E Bike Mihos
Follow us on

మీరు హై స్పీడ్ స్కూటర్ కావాలని అనుకుంటున్నారా? అది కూడా ఎలక్ట్రిక్ అయితే బాగుండు అనుకుంటున్నారా? అయితే మీకిది బెస్ట్ ఆప్షన్. జాయ్ ఈ- బైక్ కంపెనీ తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మిహోస్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు  2023 ఆటో ఎక్స్‌పోలో దీనిని ప్రదర్శించింది. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వడోదరలోని వార్డ్‌విజార్డ్ R&D బృందం రూపొందించి అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

లుక్ సూపర్.. ఫీచర్స్ అదుర్స్..

మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టైలింగ్ పరంగా రెట్రో డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో ముందువైపు రౌండ్ హెడ్‌లైట్, సర్క్యూలర్ ఆకారంలో వెనుక అద్దాలు, ఆప్రాన్-మౌంటెడ్ ఫ్రంట్ టర్న్ ఇండికేటర్‌లు , కర్వీ బాడీ ప్యానెల్‌లు ఉన్నాయి. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌లపై, అలాగే వెనుక వైపున మోనో-రివర్సిబుల్ స్ప్రింగ్ సస్పెన్షన్‌ ఉంది. అలాగే సైడ్ స్టాండ్ సెన్సార్,హైడ్రాలిక్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS) వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, బ్యాటరీకి రిమోట్ యాక్సెస్, రివర్స్ మోడ్, GPS, యాంటీ-థెఫ్ట్ ఫీచర్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

సామర్థ్యం ఇలా..

మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 1500W ఎలక్ట్రిక్ మోటార్ తో వస్తుంది. ఇది 95Nm టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ ఏడు సెకన్లలోపే 0-40కిమీల వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. అదే సమయంలో, గరిష్ట వేగం గంటకు 70 కి.మీ. ఇంకా, ఇది నికెల్ మాంగనీస్ కోబాల్ట్ కెమిస్ట్రీతో 74V40Ah లియాన్ ఆధారిత బ్యాటరీని ఉంటుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి.మీ. మైలేజీ వస్తుంది.

ఇవి కూడా చదవండి

ధర ఎంతంటే..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నాలుగు రంగులలో లభ్యమవుతుంది. అవేంటంటే మెటాలిక్ బ్లూ, సాలిడ్ బ్లాక్ గ్లోసీ, సాలిడ్ ఎల్లో గ్లోసీ, పెర్ల్ వైట్. దీని ధర రూ. 1,49,000 ఎక్స్-షోరూమ్ (పాన్ ఇండియా) ఉంది. గుజరాత్‌ వడోదరలోని కంపెనీ తయారీ కేంద్రంలో దీనిని తయారు చేసి.. దశల వారీగా దేశ వ్యాప్తంగా డెలివరీలు చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..