Jio Gemini Offer: జియో యూజర్లకు గుడ్ న్యూస్! రూ.35,000 విలువైన గూగుల్ జెమిని ప్రో ప్లాన్ ఫ్రీ!

రీసెంట్‌గా ఎయిర్‌‌టెల్ తమ యూజర్లకు ఏడాది పాటు ఫ్రీ పర్‌‌ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌‌ను తీసుకొచ్చింది. దీనికి పోటీగా ఇప్పుడు జియో సంస్థ.. టెక్ దిగ్గజం గూగుల్ తో కలిసి ఒక ఒప్పందం చేసుకుంది. జియో యూజర్లకు ఫ్రీగా గూగుల్ జెమినీ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్ ను ఇవ్వనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Jio Gemini Offer: జియో యూజర్లకు గుడ్ న్యూస్! రూ.35,000 విలువైన గూగుల్ జెమిని ప్రో ప్లాన్ ఫ్రీ!
Jio Gemini Offer

Updated on: Oct 31, 2025 | 3:45 PM

రిలయన్స్ జియో సంస్థ తమ యూజర్లకు భారీ సర్ ప్రైజ్ ఇచ్చింది. తాజా ప్రకటన ప్రకారం రూ.35,100 విలువైన గూగుల్ జెమినీ ఏఐ ప్రో ప్లాన్, అలాగే జెమిని యాప్‌లోని జెమిని 2.5 ప్రో మోడల్ ను జియో కస్టమర్లకు 18 నెలల పాటు పూర్తిగా ఉచితంగా అందించనుంది. ఈ ప్రత్యేక ఆఫర్ అక్టోబర్ 30 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ ఆఫర్ కు కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటంటే..

ఆఫర్ ఇదే..

జియో యూజర్లు ఇకపై గూగుల్ జెమినీ ఏఐ ప్రో వెర్షన్ ను ఉచితంగా వాడుకోవచ్చు. ఈ ఆఫర్‌ 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల కస్టమర్లకు మాత్రమే వర్తి్స్తుంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ఆఫర్ పొందాలంటే ఏదైనా జియో అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకోవాలి.  అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ ఉన్న యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు 2టీబీ వరకూ క్లౌడ్ స్టోరేజ్, వియో 3.1 వీడియో జనరేటర్, నానో బనానా ఇమేజ్ జనరేషన్ టూల్స్ వంటి ప్రత్యేక ఫీచర్లు కూడా పొందొచ్చు.

ఇలా పొందొచ్చు

ఇకపోతే ఈ ఆఫర్ ను యాక్సెస్ చేయడం కోసం యూజర్లు ముందుగా ఏదైనా అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకోవాలి. ఆ తర్వాత మైజియో యాప్ లోకి వెళ్లి అక్కడ కనిపించే గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ ను యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత అదే నెంబర్ తో గూగుల్ జెమినీ యాప్ లోకి లాగిన్ అయ్యి ప్రో ప్లాన్ ఫీచర్లను వాడుకోవచ్చు. జెమిని కోడ్ అసిస్ట్, నోట్‌బుక్ ఎల్ఎం, జీమెయిల్,గూగుల్ డాక్స్ వంటి సేవల్లో కూడా జెమినీ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఉచితంగా పొందిన 2 టీబీ క్లౌడ్ స్టోరేజ్ ను గూగుల్ ఫోటోస్, జీమెయిల్, గూగుల్ డ్రైవ్,అలాగే వాట్సాప్ చాట్ బ్యాకప్ వంటి అవసరాల కోసం వాడుకోవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి