jio: జియో ధమాకా ఆఫర్.. రూ.500 ప్లాన్‌తో 10కిపైగా OTTలు.. ఉచితంగా ‘గూగుల్ జెమినీ ప్రో’!

Jio Mega Content Plans: జియో ధమాకా ఆఫర్.. రూ.500 ప్లాన్‌తో 10కిపైగా OTTలు.. ఉచితంగా 'గూగుల్ జెమినీ ప్రో'! జియోరకరకాల ప్లాన్‌లను తీసుకువస్తోంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఓటీటీ కంటెంట్‌తో కూడిన ప్లాన్‌లను తీసుకువస్తోంది. అంతేకాదు.. వేల రూపాయలు విలువ చేసే AI యాక్సెస్‌ను కూడా అందిస్తోంది. కేవలం రూ.500 రీఛార్జ్‌ తోనే ఓటీటీ కంటెంట్‌తో పాటు..

jio: జియో ధమాకా ఆఫర్.. రూ.500 ప్లాన్‌తో 10కిపైగా OTTలు.. ఉచితంగా గూగుల్ జెమినీ ప్రో!
Jio Plan: జియో తన వినియోగదారుల కోసం అనేక కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువస్తోంది. ఈసారి అపరిమిత కాలింగ్ వ్యాలిడిటీని అందించే చవకైన ప్లాన్‌ను కోరుకునే వారి కోసం, కంపెనీ రూ. 448కే ఒక ప్రత్యేక 'వాయిస్-ఓన్లీ' ప్లాన్‌ను అందిస్తోంది.

Updated on: Apr 25, 2026 | 8:34 AM

Jio Mega Content Plans: భారతీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన యూజర్ల కోసం ఒక విప్లవాత్మకమైన ‘మెగా కంటెంట్ ప్లాన్’ (Mega Content Plan) ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కేవలం డేటా, కాల్స్ మాత్రమే కాకుండా, ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), భారీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను ఒకే ప్యాకేజీలో అందిస్తోంది.

ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?

1. రూ.500 మెగా కంటెంట్ ప్లాన్ – ఫీచర్లు:

ఈ ప్లాన్ ముఖ్యంగా సినిమా ప్రియులు, టెక్నాలజీ ఆసక్తి ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. దీని వాలిడిటీ 28 రోజులు. ఇక డేటా విషయానికొస్తే.. రోజుకు 2 GB హైస్పీడ్ డేటా. వాయిస్ కాల్స్ , SMS: అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 SMSలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

2. OTT సబ్‌స్క్రిప్షన్ల జాతర:

ఈ ప్లాన్ అతిపెద్ద ఆకర్షణ అందులోని కంటెంట్. జియో టీవీ (JioTV) యాప్ ద్వారా 10కి పైగా ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లను వీక్షించవచ్చు. ప్రీమియం యాక్సెస్ ఉంటుంది. హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో (మొబైల్ ఎడిషన్), యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium). ఇతర OTTల విషయానికొస్తే.. సోనీ లివ్, జీ5, సన్ నెక్స్ట్ వంటి మరిన్ని ప్లాట్‌ఫారమ్‌లు ఈ ప్యాకేజీలో భాగం.

3. గూగుల్ జెమినీ ప్రో (Google Gemini Pro) :

టెలికాం రంగంలోనే మొదటిసారిగా జియో తన ప్లాన్‌లో ఏఐ (AI) ఫీచర్లను జోడించింది. జెమినీ ప్రో: 18 నెలల పాటు గూగుల్ జెమినీ ప్రో సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఇది మెరుగైన ఏఐ సామర్థ్యాలతో మీ పనులను సులభతరం చేస్తుంది. ఇక క్లౌడ్ స్టోరేజ్: ఏకంగా 5 వేల GB (5 TB) గూగుల్ క్లౌడ్ స్టోరేజీని యూజర్లు పొందవచ్చు. దీనివల్ల ఫోటోలు, వీడియోలు మరియు డాక్యుమెంట్లను దాచుకోవడానికి స్పేస్ సమస్య ఉండదు.

4. రూ.200 మెగా కంటెంట్ యాడ్-ఆన్ (Add-on) ప్లాన్:

మీకు ఇప్పటికే ఉన్న బేసిక్ ప్లాన్‌కు అదనంగా ఈ చిన్న ప్యాక్ వేసుకోవచ్చు. ఇందులో 5 GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. ప్రత్యేకంగా యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుంది, దీనివల్ల ప్రకటనలు లేని వీడియోలను ఆస్వాదించవచ్చు.

ఓటిటి సబ్‌స్క్రిప్షన్ల కోసం విడివిడిగా వేల రూపాయలు ఖర్చు చేసేవారికి ఈ ప్లాన్ ఒక వరం లాంటిది. ముఖ్యంగా 5 TB క్లౌడ్ స్టోరేజ్ మరియు 18 నెలల జెమినీ ప్రో ఆఫర్ అనేది యూజర్లకు లభించే అతిపెద్ద ప్రయోజనం. జియో యాప్ లేదా సమీపంలోని రీఛార్జ్ సెంటర్ల ద్వారా ఈ ప్లాన్‌లను యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Business Idea: రూ. 10 పెట్టుబడి.. రూ. 90 లాభం.. గాజుల వ్యాపారంతో కాసుల వర్షం – టాప్ 5 బిజినెస్ ఐడియాలు ఇవే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us