JIO Offers: టెలికం కంపెనీల మధ్య రోజురోజుకీ పెరుగుతోన్న పోటీ వినియోగదారులకు లాభంగా మారుతోంది. వినియోగదారులను ఆకర్షించే క్రమంలో పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ‘నో డేలీ లిమిట్’తో ఫ్రీడమ్ ప్రీపెడ్ ప్లాన్స్‌ను ప్రకటించాయి. ఈ ప్లాన్స్ రూ. 127తో మొదలై రూ. 2397 వరకు ఉన్నాయి. ఈ ప్లాన్స్‌తో రీచార్జ్ చేసుకున్న వారికి జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్ వంటి యాప్‌లను ఉచితంగా అందిస్తోంది జియో.
జియో అందిస్తోన్న ఆఫర్లలో ప్రధానమైంది రూ. 447 ఫ్రీడమ్ ప్రీపెడ్ ప్లాన్. ఈ రీచార్జ్ చేసుకున్న వారికి 60 రోజుల వ్యాలిడిటీకి 50 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, జియో యాప్స్‌ను ఉచితంగా యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక రూ. 444 రీచార్జ్ చేసుకున్న వారికి రోజూ 2 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు అందిస్తారు.
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ కూడా ఆకర్షీయణీమైన ఆఫర్లను ప్రకటించింది. రూ. 447తో రీచార్జ్ చేసుకుంటే 60 రోజుల వ్యాలిడిటీతో 100 జీబీ డేటాను అందిస్తారు. ఈ డేటా పరిమితి దాటిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 80 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఇక అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఉచితంగా అందిస్తారు. వీటితో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్, ఈరోస్ నౌ ఎంటర్‌టైన్‌మెంట్ సేవలను ఉచితంగా పొందొచ్చు.
ఎయిర్ టెల్ కూడా వినియోగదారులను ఆకర్షించే పనిలో పడింది. ఇందులో భాగంగానే కొత్తగా రూ. 448 రీచార్జ్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీంతో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3 జీబీ డేటాను పొందొచ్చు. అలాగే ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు. అంతేకాకుండా రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో (మొబైల్ ఎడిషన్), వింక్ మ్యూజిక్, షా అకాడమీని కూడా యాక్సెస్ పొందొచ్చు.
Also Read: Maha Ganesha: ఆహా మరో ముందడుగు.. పిల్లల కోసం ప్రత్యేకంగా మహా గణేశ.. వినోదంలో మరింత జోష్..
న్యూజిలాండ్ లో ఒక్క రోజులో పెరిగిన కోవిడ్-19 కేసులు..గత ఏడాది ఏప్రిల్ తరువాత తొలిసారిగా..