Bank Customers Alert: మీరు బ్యాంకు పనుల కోసం వెళ్తున్నారా..? ఇవి తెలుసుకొని వెళ్లండి.. లేకపోతే..

ప్రతినెల బ్యాంకులకు సెలవులు ఉండటం అనేది సర్వసాధారణమే. అయితే బ్యాంకు లావాదేవీలు, ఇతర పనులు చేసుకునేవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..

Bank Customers Alert: మీరు బ్యాంకు పనుల కోసం వెళ్తున్నారా..? ఇవి తెలుసుకొని వెళ్లండి.. లేకపోతే..
Bank

Updated on: Dec 19, 2022 | 3:43 PM

ప్రతినెల బ్యాంకులకు సెలవులు ఉండటం అనేది సర్వసాధారణమే. అయితే బ్యాంకు లావాదేవీలు, ఇతర పనులు చేసుకునేవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రతి నెల రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. బ్యాంకు కస్టమర్లు పనులను చేసుకునేందుకు ముందస్తు ప్లాన్‌ చేసుకోవడం మంచిది. లేకపోతే సమయం వృధా కావడమే కాకుండా నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంది. వచ్చే ఏడాది అంటే 2023 జనవరి నెలలో బ్యాంకులకు 15 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి.

జనవరిలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయి

  1. జనవరి 1 – న్యూ ఇయర్‌తో పాటు ఆదివారం ఉన్నందున కామన్‌గా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  2. జనవరి 2 – మిజోరంలో కొత్త సంవత్సరం సెలవు, మిజోరంలో బ్యాంకులకు సెలవు.
  3. జనవరి 8 – ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  4. జనవరి 11 – మిజోరంలో మిషనరీ డే, మిజోరంలో బ్యాంకులు మూసి ఉంటాయి.
  5. జనవరి 12 – స్వామి వివేకానంద జయంతి. పశ్చిమ్ బంగాలో ఈ రోజును బ్యాంకులు బంద్ ఉంటాయి.
  6. జనవరి 14 – మకర సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, కర్ణాటక, అసోం, సిక్కింలో బ్యాంకులు మూసి ఉంటాయి.
  7. జనవరి 15- ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  8. జనవరి 16- కనుమ పండగ- ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు, ఉళవర్ తిరునైల్ పుదుచ్చేరి, తమిళనాడులో బ్యాంకులు బంద్.
  9. జనవరి 22- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  10. జనవరి 23- నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. అసోంలో బ్యాంకులు బంద్.
  11. జనవరి 25- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. అక్కడ మాత్రమే బ్యాంకులు బంద్‌ ఉంటాయి.
  12. జనవరి 26- రిపబ్లిక్ డే, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  13. జనవరి 28- నాలుగో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.
  14. జనవరి 29- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  15. జనవరి 31- మీ – డ్యామ్ -మీ-ఫై అసోంలో బ్యాంకులు మూసి ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి