Telugu News Business Is your CIBIL score low? These are the reasons, these tips must be followed
Cibil Score Tips: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా? కారణాలివే.. ఈ టిప్స్ పాటించడం మస్ట్
హోమ్ లోన్, వాహన రుణం, వ్యక్తిగత రుణం ఇలా అవసరం ఏదైనా రుణం కావాల్సి వస్తుంది. అయితే రుణం మంజూరు విషయంలో క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యమైన అంశం. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే సాధిస్తే అంత ఈజీగా రుణం పొందవచ్చు. రుణగ్రహీతల సిబిల్ స్కోర్ సంకలనం చేసే వివిధ క్రెడిట్ సమాచార ఏజెన్సీలు ఉన్నాయి.
ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చులు, అవసరాల నేపథ్యంలో రుణం తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరైంది. హోమ్ లోన్, వాహన రుణం, వ్యక్తిగత రుణం ఇలా అవసరం ఏదైనా రుణం కావాల్సి వస్తుంది. అయితే రుణం మంజూరు విషయంలో క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యమైన అంశం. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే సాధిస్తే అంత ఈజీగా రుణం పొందవచ్చు. రుణగ్రహీతల సిబిల్ స్కోర్ సంకలనం చేసే వివిధ క్రెడిట్ సమాచార ఏజెన్సీలు ఉన్నాయి. కాబట్టి ఆయా ఏజెన్సీల నిపుణులు సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవచ్చో? ఓ సారి తెలుసుకుందాం.
మీ క్రెడిట్ నివేదికను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. ఇలా చేయడం ద్వారా మీ స్కోర్‌ను ప్రభావితం చేసే లోపాలను గుర్తించండి.
ఈఎంఐలు, ఇతర బిల్లులు సమయానికి చెల్లించాలి. మీరు తరచూ పయోగించే ఫోన్‌లో రిమైండర్‌లను సెట్ చేసుకోవడం ఉత్తమం.
క్రెడిట్ వినియోగాన్ని తగ్గించాలి. మీ క్రెడిట్ కార్డు వాడకం అనేది 30 శాతానికి మించికూడదని గుర్తుంచుకోవాలి..
విభిన్న క్రెడిట్ కార్డులను వాడడం ద్వారా క్రెడిట్ మిశ్రమాన్ని వైవిధ్యపరచాలి.
తక్కువ లోన్ అప్లికేషన్లను ఉపయోగించాలి. బహుళ అప్లికేషన్‌లను నివారించడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపర్చవచ్చు.
సురక్షిత క్రెడిట్‌ని ఉపయోగించడం ద్వారా సురక్షిత ఎంపికలతో మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపర్చుకోవచ్చు.
ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ బాకీ ఉన్న బ్యాలెన్స్‌లను చెల్లించాలి.
బడ్జెట్, ప్రణాళికకు అనుగుణంగా రుణ చెల్లింపులు చేయాలి. ముఖ్యంగా పొదుపు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సానుకూల అలవాట్లు క్రమంగా ఫలితాలను ఇస్తాయి.
బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రవర్తన, తెలివైన క్రెడిట్ మేనేజ్‌మెంట్ నుంచి క్రమేణ మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. మీ స్కోర్ పెరుగుతున్నందున మీరు కొత్త రుణగ్రహీత అయినప్పటికీ స్కోర్ మెరుగుపడుతుందని నిపుణులు తెలిపారు. కస్టమర్‌లు అప్రమత్తంగా ఉండాలని సమయానికి చెల్లించాలని లోన్ విచారణలను పరిమితం చేయాలని, రుణం తీసుకోవడం సూచిస్తున్నారు.