Marriage Loan: అప్పు చేసి పెళ్లి చేసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి..

|

Jul 07, 2024 | 4:04 PM

నా పెళ్లి గురించి నలుగురూ మాట్లాడుకోవాలని అనే ధోరణి ఇటీవల కాలంలో చాలా మందిలో కనిపిస్తోంది. అందుకోసం చాలా మంది అధిక ఖర్చుకు వెనుకాడటం లేదు. అయితే అది వారు పొదుపు చేసిన మొత్తం నుంచి వినియోగించడం లేదు. రుణాలను తీసుకుంటున్నారు. సాధారణంగా మ్యారేజ్ లోన్స్ అంటే పర్సనల్ లోన్లే. అంటే ఇవి అసురక్షిత లోన్లు. అధిక వడ్డీపై ఈ రుణాలను బ్యాంకర్లు అందిస్తారు.

Marriage Loan: అప్పు చేసి పెళ్లి చేసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి..
Dream Marriage
Follow us on

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానమైనది. వన్స్ ఇన్ ఏ లైఫ్ గా అందరూ భావిస్తారు. అందుకే ఆడంబరంగా.. పదికాలాలు గుర్తిండిపోయేలా చేసుకోవాలని అందరూ భావిస్తారు. అయితే అది ఆర్థికంగా అంతే భారాన్ని కుటుంబాలపై మోపుతుంది. ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలైతే ఫర్వాలేదు గానీ.. ఆర్థికంగా ఇబ్బందులు పడే వారైతే పెళ్లి కోసం అప్పులు చేయడం మనం తరచూ చూస్తుంటాం. పాత కాలంలో అయితే తమ పిల్లల పెళ్లిళ్ల కోసం తల్లిదండ్రులు ఆస్తులు, బంగారం తాకట్టు పెట్టడం, పొలాలు విక్రయించడం వంటివి చేస్తుండే వారు. ఇప్పటికీ ఇదే పద్ధతిని పాటించే వారూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో పిల్లలు తమ పెళ్లి భారాన్ని తల్లిదండ్రులపై ఉంచడం లేదు. ముఖ్యంగా మధ్య తరగతి నుంచి ఉన్నత స్థాయి వారు ఇదే తరహా ఆలోచనల్లో ఉంటున్నారు. పెళ్లి సమయానికే వారు ఏదో ఒక ఉద్యోగమో, వ్యాపారమో చేస్తుంటారు కాబట్టి మొత్తం వారే భరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వారు ముందుగా పొదుపు చేయడం లేదు. కానీ పెళ్లి నెపంతో రుణాలను వైపు మొగ్గుచూపుతున్నారు. అధిక వడ్డీలకు పెళ్లి రుణాలు ఎక్కువ శాతం మంది తీసుకుంటున్నారు. అయితే ఇలా తీసుకోవడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు? తెలుసుకుందాం రండి..

పెళ్లి కోసం పర్సనల్ లోన్..

నా పెళ్లి గురించి నలుగురూ మాట్లాడుకోవాలని అనే ధోరణి ఇటీవల కాలంలో చాలా మందిలో కనిపిస్తోంది. అందుకోసం చాలా మంది అధిక ఖర్చుకు వెనుకాడటం లేదు. అయితే అది వారు పొదుపు చేసిన మొత్తం నుంచి వినియోగించడం లేదు. రుణాలను తీసుకుంటున్నారు. సాధారణంగా మ్యారేజ్ లోన్స్ అంటే పర్సనల్ లోన్లే. అంటే ఇవి అసురక్షిత లోన్లు. అధిక వడ్డీపై ఈ రుణాలను బ్యాంకర్లు అందిస్తారు. అయితే గ్రాండ్ వెడ్డింగ్ కోసం ఇలా అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవడం ఆమోద యోగ్యమేనా? అంటే కాదనే సమాధానాన్ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

రుణాలు ఎందుకు తీసుకోవాలి..

సాధారణంగా విలువైన ఆస్తులను కొనుగోలు చేసేందుకు రుణం తీసుకోవడం ఉత్తమం. అయితే వివాహం కోసం రుణం అనేది కేవలం సొసైటీలో గొప్ప కోసం.. మన గురించి పది మంచి చెప్పుకోవాలనే భావనతో మాత్రమే తీసుకునే రుణం. ఇది సరియైన మార్గం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది పెళ్లి తర్వాత వ్యక్తులపై అదనపు భారం అవుతుందని వివరిస్తున్నారు.

వివాహ బడ్జెట్‌ను తగ్గించాలి..

మరి అలాంటప్పుడు ఏం చేయాలని నిపుణులను అడిగితే ఇక్కడ సాధారణంగా వ్యక్తమయ్యే అభిప్రాయం పెళ్లి బడ్జెట్ తగ్గించుకోవాలి. మీ పొదుపులు సరిపోకపోతే, బడ్జెట్‌ను తగ్గించి, రుణం తీసుకోకుండా మీ బడ్జెట్‌లో మీ ఖర్చులను తీసుకురావడాన్ని పరిగణించండి. పెళ్లి కోసం తీసుకునే రుణాలపై పెళ్లి తర్వాత ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇది పెళ్లి తర్వాత వ్యక్తులకు ఆర్థిక స్వేచ్ఛని దూరం చేస్తోంది.

తప్పనిసరై రుణం తీసుకోవాలంటే..

సాధారణంగా పెళ్లి చేసుకోవడానికి కూడా ఆర్థిక ఇబ్బంది అయ్యి.. తప్పనిసరిగా రుణం తీసుకోవాల్సి వస్తే మీకు ఎంత అవసరమో అంతే తీసుకోవడం ఉత్తమం. నిజంగా అవసరమైన దానికంటే ఎక్కువ రుణం తీసుకోకండి. కేవలం ప్రాథమిక విషయాల కోసం మాత్రమే రుణం తీసుకోండి.

పెళ్లి ఖర్చులు తగ్గించుకొని ఏం చేయాలి..

పెళ్లి కోసం మీరు కనీసం రూ. 25లక్షలు ఖర్చు పెట్టాలనుకుంటే.. దానిని రూ. 10లక్షలలోపు మొత్తంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి.. మిగిలిన రూ. 15లక్షలను ఏదైనా మంచి పెట్టుబడి పథకంలో ఇన్వెస్ట్ చేస్తే.. వచ్చే మూడు నుంచి ఐదేళ్ల కాల వ్యవధిలో మీ డబ్బు మరింత రాబడని పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. అది భవిష్యత్తులో పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లకు మంచి కార్పస్ ను సృష్టిస్తాయని వివరిస్తున్నారు.

పెళ్లి ప్లానింగ్ ఇలా ఉండాలి..

మీరు త్వరలో వివాహం చేసుకోవాలనే ప్లాన్లో ఉంటే మీరు ముందు నుంచి ప్లాన్ కలిగి ఉండాలి. మీరు ఎంత భరించగలరో అంతే ఖర్చుతో పెళ్లి చేసుకోవాలి. అలాగే పెళ్లికి ముందు నుంచే కొంత మొత్తాన్ని పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. ఉదాహరణకు మీరు 20 ఏళ్ల వయసులో ఉంటే.. ఇప్పటి నుంచే వివాహం కోసం పొదుపు చేయడాన్ని ప్రారంభించొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..