మీకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!

దేశంలో పెరుగుతున్న ఆరోగ్య బీమా సమస్యలైన అధిక ప్రీమియంలు, క్లెయిమ్‌ల ఆలస్యం, బిల్లింగ్ లోపాలను పరిష్కరించేందుకు IRDAI ప్రత్యేక ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆరోగ్య బీమా సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించడం, చికిత్స ఖర్చులను హేతుబద్ధీకరించడం, NHCX వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రోత్సహించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కలిగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మీకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!
Health Insurance

Updated on: Apr 12, 2026 | 7:00 AM

దేశంలో పెరుగుతున్న ఆరోగ్య బీమా సమస్యలకు పరిష్కారం చూపే దిశగా కీలక ముందడుగు పడింది. పాలసీదారులు ఎదుర్కొంటున్న అధిక ప్రీమియంలు, క్లెయిమ్‌ల ఆలస్యం, ఆసుపత్రి బిల్లింగ్ లోపాలపై స్పందిస్తూ ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేక ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. సంక్షోభ సమయాల్లో ఆరోగ్య బీమా సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా ప్రకటించింది. ప్రస్తుతం వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఆసుపత్రి బిల్లింగ్ విధానం ఒకటి. ఒకే రకమైన చికిత్సకు ఆసుపత్రుల మధ్య భారీ వ్యత్యాసం ఉండటం, బీమా ఉన్నవారికి అధిక ఛార్జీలు విధిస్తున్నారనే అభిప్రాయం పెరగడం వంటి అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. చికిత్స ఖర్చులను హేతుబద్ధీకరించడం, టారిఫ్‌లలో ఏకరూపత తీసుకురావడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కలిగించే ప్రయత్నం జరుగుతోంది.

ఇక క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యాలు, నిబంధనలపై స్పష్టత లేకపోవడం వంటి సమస్యలను అధిగమించేందుకు డిజిటల్ మార్గాలను ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్‌ (NHCX) వంటి ప్లాట్‌ఫారమ్‌ల వినియోగాన్ని విస్తరించాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. దీని ద్వారా క్లెయిమ్ ప్రాసెస్ వేగవంతమై, మోసాలను కూడా తగ్గించవచ్చని భావిస్తున్నారు. అలాగే కాన్ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సూచనల మేరకు, బీమా సంస్థలు, ఆసుపత్రుల మధ్య ఉమ్మడి ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలనే ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. ఇది అమల్లోకి వస్తే బిల్లింగ్ వివాదాలు తగ్గి, రోగుల డిశ్చార్జ్ ప్రక్రియ సులభతరం కానుంది.

నిపుణుల ప్రకారం ఈ చర్యల ప్రధాన లక్ష్యం ఆరోగ్య బీమాను మరింత అందుబాటులోకి తీసుకురావడం, సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా సరళీకరించడం. దీర్ఘకాలంలో ప్రీమియంలను నియంత్రణలో ఉంచడం, పాలసీలను సులభతరం చేయడం ద్వారా ఆరోగ్య బీమాపై ప్రజల విశ్వాసాన్ని పెంచడం లక్ష్యంగా ఉంది. మొత్తంగా ఈ కొత్త కమిటీ చర్యలు అమల్లోకి వస్తే ఆరోగ్య బీమా రంగంలో పారదర్శకత పెరిగి, వినియోగదారులకు గణనీయమైన ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us