Indian Railways: రైలులో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా.? మోసపోయే ప్రమాదం ఉందంటోన్న అధికారులు.

|

Oct 12, 2023 | 10:01 PM

ఇంతకీ విషయం ఏంటంటే.. భారతీయ రైల్వే తీసుకొచ్చిన ఇ-కేటరింగ్‌కు బదులుగా కొందరు అనధికారికంగా ఫుడ్‌ డెలవరీలు అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇండియన్‌ రైల్వే అందిస్తున్నట్లుగానే ఈ అనధికారిక వెబ్‌సైట్స్‌ ఫుడ్‌ను డెలివరీ చేస్తున్నాయి. ఈ విషయాన్ని భారతీయ రైల్వే అధికారులు అధికారికంగా ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఇందులో భాగంగానే కొన్ని వెబ్‌సైట్స్‌ జాబితాను విడుదల చేశారు. ఇంతకీ ఈ జాబితాలో...

Indian Railways: రైలులో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా.? మోసపోయే ప్రమాదం ఉందంటోన్న అధికారులు.
IRCTC
Follow us on

రైల్లో ప్రయాణించే వారికి మంచి నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించేందుకుగాను. ఇండియన్‌ రైల్వే కేటరింగ్ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఇ-కేటరింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సేవల ద్వారా ప్రయాణికులు తాము కూర్చున్న చోటుకే ప్రాంతీయ వంటకాలను పొందొచ్చు. ప్రముఖ బ్రాండ్లతో కలిసి రైల్వే శాఖ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే ఈ సేవలపట్ల అప్రమత్తతో ఉండాలని తాజాగా అధికారులు తెలిఆపరు. ఇ-కేటరింగ్ ద్వారా ఫుడ్ బుక్‌ చేసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

ఇంతకీ విషయం ఏంటంటే.. భారతీయ రైల్వే తీసుకొచ్చిన ఇ-కేటరింగ్‌కు బదులుగా కొందరు అనధికారికంగా ఫుడ్‌ డెలవరీలు అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇండియన్‌ రైల్వే అందిస్తున్నట్లుగానే ఈ అనధికారిక వెబ్‌సైట్స్‌ ఫుడ్‌ను డెలివరీ చేస్తున్నాయి. ఈ విషయాన్ని భారతీయ రైల్వే అధికారులు అధికారికంగా ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఇందులో భాగంగానే కొన్ని వెబ్‌సైట్స్‌ జాబితాను విడుదల చేశారు. ఇంతకీ ఈ జాబితాలో ఉన్న ఆ వెబ్‌సైట్స్‌ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

రైల్‌రెస్ట్రో, రైలుమిత్ర, ట్రావెల్‌ఖానా, రైల్‌ మీల్‌, దిబ్రెయిల్‌, ఖానాఆన్‌లైన్‌, ట్రైన్స్‌ కేఫ్‌, ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌, ఇ-కేటరింగ్‌, ట్రైన్‌ మెనూ వంటి వెబ్‌సైట్ల ద్వారా ఆహారం ఆర్డర్‌ చేయవద్దని ఐఆర్‌సీటీసీ ప్రయాణికులకు సూచించింది. ఇవన్నీ అనధికారికంగా ఫుడ్‌ డెలివరీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఐఆర్‌సీటీసీకి చెందిన ఇ-కేటరింగ్‌ ద్వారా ఫుడ్‌ను ఎలా ఆర్డర్‌ చేసుకోవాలంటే. ఇందుకోసం ముందుగా ఇ-కేటరింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం రైలు వివరాలు లేదా స్టేషన్‌ వివరాలు ఎంటర్‌ చేయాలి.

అనంతర పీఎన్ఆర్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసిన మీకు నచ్చిన ఫుడ్‌ను బుక్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో క్యాష్‌ పే చేసే అవకాశంతో పాటు క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆప్షన్‌ను కూడా అందించారు. ఇక ఈ వెబ్‌సైట్‌తోనే కాకుండా ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌ యాప్‌ ద్వారా కూడా ఫుడ్‌ను బుక్‌ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అలాగే 1323 నెంబర్‌ కాల్‌ చేసి లేదా +91-8750001323 వాట్సాప్‌ నెంబర్‌ ద్వారా కూడా ఆహారాన్ని ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ దేశవ్యాప్తంగా సుమారు 300కి పైగా రైల్వే స్టేషన్స్‌లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది 2014 నుంచి ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..