Rakesh Jhunjhunwala: ప్రముఖ బిజినెస్ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్టాక్ మార్కెట్ దిగ్గజ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా స్టాక్ మార్కెట్ కి ఎవరు కింగ్ కాదు అంటూ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఎవరైనా తానే మార్కెట్ కింగ్ అనుకుంటే వారు ఆర్తుర్ జైలు కి వెళ్లాల్సిందే అని కామెంట్ చేశారు. మహిళల్లా మార్కెట్ కూడా కమాండింగ్ తో, అనిశ్చితిని కలిగి.. ఎప్పుడూ ఓలటైల్ గా ఉంటుందని ఆయన అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఒక్కరే మార్కెట్ పై ఆధిపత్యాన్ని చెలాయించలేరని పేర్కొన్నారు. వాతావరణాన్ని చావుని స్టాక్ మార్కెట్ ని ఎవరూ అంచనా వేయలేరని అభిప్రాయపడ్డారు.
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్ పై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రానున్న కాలంలో అవి మంచి అసెట్ క్లాస్ గా నిలవనున్నాయని అన్నారు. 2005-2006 మధ్య కాలంలో క్రిసిల్ షేర్లను అమ్మి రూ. 27 కోట్లతో తాను ముంబయిలో కొన్న ఇల్లు విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ. 45 కోట్లుగా ఉందని అన్నారు. అప్పుడు ఆ షేర్లను అమ్మకుంటే వాటి విలువ ఇప్పుడు రూ. 1000 కోట్లు అదనంగా పెట్టుబడికి సొమ్ము ఉండేదన్న ఆయన.. భారతీయుల సైకాలజీ ప్రకారం సొంత ఇల్లు కావాలని కోరుకుంటారని తన జీవితంలో జరిగిన అంశాన్ని వెల్లడించారు. దీనికి తోడు వేర్ హౌస్ (సరకు నిల్వ చేసే గోదాములు) వ్యాపారంపైనా తాను బులిష్ గా ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం భారత్ లో ఈ రంగం ప్రారంభ స్థాయిలోనే ఉందని.. చాలా కంపెనీలు లాజిస్టిక్ కంపెనీలకు సరకు నిల్వకు సంబంధించిన రెస్పాన్నిబిలిటీని ఇవ్వడం లేదని వెల్లడించారు. రాకేష్ కొత్తగా ప్రారంభించనున్న ఆకాశ్ విమానయాన కంపెనీకి టాటా ఎయిర్ ఇండియా గట్టి పోటీదారుగా నిలుస్తుందా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఏమన్నారంటే.. వ్యాపార నిర్వహణకు సంబంధించి తన వద్ద ఒక ప్రణాళిక ఉందని చెబుతూ యూరప్ కు చెందిన రియాన్ ఎయిర్ సంస్థ విజయాన్ని ఉఠంకించారు.
భారత మార్కెట్లపై గత కొంతకాలంగా బులిష్ గా ఉన్న రాకేశ్.. ప్రధానికి ఇచ్చిన ప్రెజెంటేషన్ లో భారతదేశానికి టైం వస్తుంది కాదు.. వచ్చేసింది అని వ్యాఖ్యానించారు. భారత జీడీపీ 2025-26 నాటికి 10 శాతంగా ఉండనున్నట్లు తాను అంచనా వేస్తున్నట్లు నిన్న జరిగిన సీఐఐ(కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్టీస్) సభలో పేర్కొన్నారు. రానున్న 5 సంవత్సరాల కాలంలో భారత ఐటీ రంగం 75 శాతానికి పైగా వృద్ధితో.. కొత్తగా 50 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని అన్నారు. దీని వల్ల ఐటీ ఆఫీసుల నిర్వహణ కోసం ఇప్పుడున్న దానికంటే అదనంగా 50 శాతం ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ ఉంటుందని అన్నారు. వీటికి తోడు పల్లెల నుంచి పట్టణాలకు వలస వస్తున్న వారి సంఖ్య 45 శాతానికి పెరుగుతుందని.. దాని వల్ల కొత్తగా ఇళ్లకు డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. రానున్న కాలంలో దేశంలో కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలకు డిమాండ్ భారీగా పెరుగుతుందని అంచనా వేశారు.
ఇవీ చదవండి..
Reliance Jio: రిలయన్స్ జియోకు గట్టి ఎదురుదెబ్బ.. మళ్లీ షాకిచ్చిన కస్టమర్లు..