Investment In PPF: పీపీఎఫ్‌లో పెట్టుబడి.. భవిష్యత్‌లో మంచి రాబడి.. పీపీఎఫ్‌ ప్రయోజనాలివే..!

|

Aug 27, 2023 | 10:15 AM

పీపీఎఫ్‌ను మొదటిసారిగా 1968లో ఆర్థిక మంత్రిత్వ శాఖ నేషనల్ సేవింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచారు. అనతి కాలంలోనే ఇది పెట్టుబడిదారులకు శక్తివంతమైన పెట్టుబడి సాధనంగా ఉద్భవించింది. పీపీఎఫ్‌ అనేది రిటైర్మెంట్-ఫోకస్డ్ ప్లాన్. ఇది చిన్న మొత్తాలలో సాధారణ డిపాజిట్‌తో (ఎంచుకున్న ప్లాన్ ప్రకారం) కార్పస్‌ను రూపొందించడాన్ని అనుమతిస్తుంది.

Investment In PPF: పీపీఎఫ్‌లో పెట్టుబడి.. భవిష్యత్‌లో మంచి రాబడి.. పీపీఎఫ్‌ ప్రయోజనాలివే..!
Ppf Scheme
Follow us on

పబ్లిక్‌ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) ఖాతా అనేది భారతదేశంలో సురక్షితమైన పెట్టుబడుల్లో ఒకటిగా పరిగణిస్తారు. భద్రత, రాబడి, పన్ను ఆదా ఎంపికల కలయిక కారణంగా ఇది దీర్ఘకాలిక పొదుపు కోసం ఉత్తమమైనదని ఆర్థిక నిపుణులు పేర్కొంటూ ఉంటారు. పీపీఎఫ్‌ను మొదటిసారిగా 1968లో ఆర్థిక మంత్రిత్వ శాఖ నేషనల్ సేవింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచారు. అనతి కాలంలోనే ఇది పెట్టుబడిదారులకు శక్తివంతమైన పెట్టుబడి సాధనంగా ఉద్భవించింది. పీపీఎఫ్‌ అనేది రిటైర్మెంట్-ఫోకస్డ్ ప్లాన్. ఇది చిన్న మొత్తాలలో సాధారణ డిపాజిట్‌తో (ఎంచుకున్న ప్లాన్ ప్రకారం) కార్పస్‌ను రూపొందించడాన్ని అనుమతిస్తుంది. ఇది పన్ను రహితంతో పాటు 7.1 శాతం హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. ఇది పెట్టుబడిదారులకు మరింత అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వం మీ పెట్టుబడికి హామీ ఇస్తుంది. అలాగే ప్రతి త్రైమాసికానికి వడ్డీ రేటును సెట్ చేస్తుంది. కాబట్టి పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి వడ్డీ ఏస్థాయిలో లెక్కిస్తారో? వంటి విషయాలపై అవగాహన ఉండదు. కాబట్టి పీపీఎఫ్‌ వడ్డీ లెక్కింపు వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

పీపీఎఫ్‌ ద్వారా సంవత్సరానికి కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1,50,000 వరకు పెట్టుబడి పెట్టి కొత్త ఖాతాను ప్రారంభించవచ్చు. సాధారణంగా పీపీఎఫ​ ఖాతా 15 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. అయితే మెచ్యూరిటీ తర్వాత కూడా దానిని ఐదేళ్ల పాటు పొడిగించవచ్చు. మీరు ఇప్పుడే 25 సంవత్సరాల వయస్సులో మీ కెరీర్‌ను ప్రారంభించి, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న మీ ఖాతాలో దాదాపు రూ. 1.5 లక్షలు జమ చేయగలిగితే వచ్చే ఏడాది మార్చి 31 నాటికి వడ్డీతో కలిపి దాదాపు రూ. 10,650 మీ ఖాతాలో జమ అవుతుంది. ఇది దాదాపు 7.1 శాతంగా ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1) ప్రారంభం నాటికి మీ ఖాతాలో దాదాపు రూ.1,60,650 ఉంటుంది. దీన్ని బట్టి మీరు రెండో ఆర్థిక సంత్సరంలో ఖాతాలో రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేస్తే మీ పీపీఎఫ్‌ ఖాతాలో రూ.3,10,650 ఉంటుంది. మీరు ప్రతి సంవత్సరం రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేస్తూనే ఉంటే 15 సంవత్సరాల తర్వాత మొత్తం రూ.40,68,209 అవుతుంది. అసలు మొత్తం రూ. 22,50,000, వడ్డీ రూ. 18,18,209 అవుతుంది.

అంతకంతకూ రాబడి

మీరు మరో 20 ఏళ్ల పాటు ఫైనాన్షియల్ కార్పస్‌ను అలానే వదిలేస్తే అది రూ.1 కోటికి పెరుగుతుంది. నెలవారీ రూ.9165 పెట్టుబడి మిమ్మల్ని 30 ఏళ్లలో మిలియనీర్‌గా మార్చగలదు. దానిలో మొదటి 15 సంవత్సరాలలో సాధారణ పెట్టుబడి ఉంటుంది. ఆ తర్వాత మీరు దేనినీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఆ మొత్తాన్ని మీ పీపీఎఫ్‌ ఖాతాలో మరో 15 సంవత్సరాల పాటు ఉంచాలనే విషయంలో గమనించాలి. ప్రతి సంవత్సరం నిరంతర పెట్టుబడితో ఖాతా మెచ్యూర్ అయినప్పుడు అంటే ఖాతాదారుడికి 60 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు తీసుకుంటే మంచి రాబడి వస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం