LIC: ఎల్‌ఐసీ నుంచి కొత్త పాలసీ.. బీమా రత్న పేరుతో లాంచ్ చేసిన కంపెనీ..

|

May 28, 2022 | 6:47 AM

దేశంలో అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా , 27 మే 2022 శుక్రవారం కొత్త పాలసీని ప్రారంభించింది. బీమా రత్న పేరుతో ఎల్‌ఐసీ కొత్త పాలసీని ప్రారంభించింది.

LIC: ఎల్‌ఐసీ నుంచి కొత్త పాలసీ.. బీమా రత్న పేరుతో లాంచ్ చేసిన కంపెనీ..
Lic
Follow us on

దేశంలో అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా , 27 మే 2022 శుక్రవారం కొత్త పాలసీని ప్రారంభించింది. బీమా రత్న పేరుతో ఎల్‌ఐసీ కొత్త పాలసీని ప్రారంభించింది . కొత్త పాలసీ గురించి ఇన్సూరెన్స్ కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీకి తెలియజేసింది. BSEలో అందించిన సమాచారం ప్రకారం, LIC బీమా రత్న పాలసీ అనేది నాన్-లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఎల్‌ఐసి స్టాక్ మే 17న స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. ఇష్యూ ధర రూ.949 కాగా ఈ స్టాక్ రూ.872 స్థాయిలో లిస్ట్ అయింది. ఎల్‌ఐసి బోర్డు సమావేశం వచ్చే వారం 30 మే 2022న జరగనుంది. ఈ సమావేశంలో మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నారు. కంపెనీ డివిడెండ్ చెల్లించడాన్ని పరిశీలిస్తుంది. LIC IPO ఇష్యూ ధర కంటే 13 శాతం తక్కువగా ఉంది. శుక్రవారం బిఎస్‌ఇలో ఎల్‌ఐసి షేరు ధర రూ.8210.50 వద్ద ముగిసింది.

స్టాక్ ఎక్స్ఛేంజీకి ఇచ్చిన సమాచారంలో, మే 30 న, కంపెనీ ఆడిట్ చేసిన ఫలితాలు, త్రైమాసిక ఫలితాలు, మొత్తం ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పనితీరుకు సంబంధించిన ఫలితాలను ప్రకటిస్తుందని ఎల్‌ఐసి తెలిపింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించుకుంటే, అదే రోజున ప్రకటించవచ్చు. LIC కోసం, ప్రభుత్వం ధర బ్యాండ్‌ను రూ. 902-949గా ఉంచింది. ఇష్యూ ద్వారా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ.20,560 కోట్లను సమీకరించింది. మొత్తం IPO దాదాపు 3 సార్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఇష్యూకు దేశీయ ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. అయితే విదేశీ ఇన్వెస్టర్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ కారణంగా, ఇష్యూతో పాటు దాని గ్రే మార్కెట్ ప్రీమియం తగ్గింది.ఇష్యూ ముగిసిన తర్వాత గ్రే మార్కెట్ ప్రీమియం ప్రతికూలంగా మారింది.