అదిరిపోయే ఆఫర్‌.. ఒక్క రూపాయికే ఫ్లైట్‌ టిక్కెట్‌! 3 రోజులే టైముంది.. వెంటనే బుక్‌ చేసుకోండి!

ఇండిగో 'Sail Into 2026' సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరకే విమానం ప్రయాణం అందిస్తోంది. జనవరి 13-16 వరకు బుకింగ్స్, జనవరి 20-ఏప్రిల్ 30 మధ్య ప్రయాణానికి అవకాశం కల్పించింది. తక్కువ ధరలో విమాన ప్రయాణం కోసం ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవచ్చు.

అదిరిపోయే ఆఫర్‌.. ఒక్క రూపాయికే ఫ్లైట్‌ టిక్కెట్‌! 3 రోజులే టైముంది.. వెంటనే బుక్‌ చేసుకోండి!
Indigo Flights

Updated on: Jan 13, 2026 | 3:18 PM

అతి తక్కువ ఖర్చుతో విమానంలో ప్రయాణించాలని అనుకుంటున్నారా? అయితే మీకో అదిరిపోయే గుడ్‌న్యూస్‌. అతి తక్కువ ధరలో మీరు ఫ్లైట్‌ జర్నీ చేయొచ్చు. ప్రముఖ ఎయిర్‌ లైన్స్‌ ఇండిగో కలలో కూడా ఊహించని ఆఫర్‌ను తీసుకొచ్చింది. 2026 ఏడాదికి వెల్‌కమ్‌ చెబుతూ స్పెషల్‌ న్యూ ఇయర్‌ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌కు Sail Into 2026 అని పేరు పెట్టారు. ఈ ఆఫర్ కింద డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌ టిక్కెట్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. ముఖ్యంగా దేశీయ మార్గాల్లో వన్-వే ఛార్జీలు కేవలం రూ.1,499 నుండి ప్రారంభమవుతాయి, అంతర్జాతీయ ఛార్జీలు రూ.4,499 నుండి ప్రారంభమవుతాయి.

ఈ సేల్‌ జనవరి 13 నుండి జనవరి 16 వరకు ఓపెన్‌ ఉంటుంది. ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టిక్కెట్లు జనవరి 20 నుంచి ఏప్రిల్ 30 మధ్య ప్రయాణానికి చెల్లుతాయి. ఈ సేల్ కింద డొమెస్టిక్‌ ఫ్లైట్‌ వన్-వే ఛార్జీలు రూ.1,499, ఇంటర్నేషనల్‌ మార్గాలలో వన్-వే ఛార్జీలు రూ.4,499 నుండి ప్రారంభమవుతాయి. ఎక్కువ లెగ్‌రూమ్ సౌకర్యాన్ని అందించే ఇండిగో స్ట్రెచ్ సీట్లు ఎంపిక చేసిన డొమెస్టిక్‌ రూట్లలో రూ.9,999 నుండి ప్రారంభమవుతాయి.

పిల్లలకు ప్రత్యేక ఆఫర్‌

చిన్న పిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులకు ఇండిగో కూడా గుడ్‌న్యూస్‌ చెప్పింది. పిల్లలకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉంటే, వారి దేశీయ విమాన టికెట్‌ను కేవలం రూ.1కి బుక్ చేసుకోవచ్చు. ఈ న్యూఇయర్‌ సేల్ టిక్కెట్లపై మాత్రమే కాకుండా అదనపు సౌకర్యాలపై కూడా డిస్కౌంట్లను అందిస్తుంది. కొన్ని 6E యాడ్-ఆన్‌లు 70 శాతం వరకు తగ్గింపుతో లభిస్తాయి. ప్రీపెయిడ్ అదనపు బ్యాగేజీపై 50 శాతం వరకు తగ్గింపుతో పాటు, ఎంపిక చేసిన రూట్‌లలో స్టాండర్డ్ సీట్ సెలెక్షన్‌లపై 15 శాతం వరకు తగ్గింపుతో లభిస్తాయి. ఎమర్జెన్సీ XL సీట్లు కూడా ఎంపిక చేసిన దేశీయ రూట్‌లలో రూ.500 నుండి ప్రారంభమవుతాయి. టిక్కెట్లను ప్రయాణీకులు ఇండిగో అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, AI అసిస్టెంట్ 6ESkai, WhatsApp, ఎంపిక చేసిన ట్రావెల్ పార్టనర్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి