Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 307, నిఫ్టీ 95 పాయింట్ల ప్లస్..

|

Feb 23, 2022 | 9:40 AM

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తల మధ్య భారతీయ స్టాక్ మార్కెట్లు(stock market) సానుకూలంగా ప్రారంభమైయ్యాయి..

Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 307, నిఫ్టీ 95 పాయింట్ల ప్లస్..
Stock Market
Follow us on

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తల మధ్య భారతీయ స్టాక్ మార్కెట్లు(stock market) సానుకూలంగా ప్రారంభమైయ్యాయి. సెన్సెక్స్(sensex) 307.15 పాయింట్లు (0.54% పెరిగి) 57607.83 వద్ద, నిఫ్టీ 95.30 పాయింట్లు (0.56%) పెరిగి 17187.50 వద్ద ఉన్నాయి. దాదాపు 1388 షేర్లు పురోగమించగా, 554 షేర్లు క్షీణించాయి. 60 షేర్లు మారలేదు. నిఫ్టీ(Nifty)లో కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, బీపీసీఎల్, ఎంఅండ్‌ఎంలు లాభపడగా, ఓఎన్‌జీసీ, ఎల్‌అండ్‌టీ నష్టపోయాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధ భయాలు నెలకొన్నా మార్కెట్లు రాణిస్తుండటం విశేషం. కొద్దిరోజులుగా భారీగా పతనమైన షేర్లను కొనుగోలు చేసేందుకు మదుపర్లు మొగ్గుచూపడం వల్ల సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత సురక్షితమైన కొనుగోళ్ల కారణంగా బంగారం, వెండి మంగళవారం లాభపడింది.

మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.96 శాతం లాభాల్లో ఉండగా స్మాల్ క్యాప్ షేర్లు 1.59 శాతం ఎగబాకాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సంకలనం చేసిన మొత్తం 15 సెక్టార్ గేజ్‌లు ఎరుపు రంగులో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ పీఎస్‌యు బ్యాంక్, నిఫ్టీ ఆటో వరుసగా 1.10 శాతం, 0.90 శాతం చొప్పున పెరగడం ద్వారా ఇండెక్స్‌లో తక్కువ పనితీరును కనబరుస్తున్నాయి.

Read Also.. Old Pension Scheme: పాత పెన్షన్‌ విధానం తీసుకురానున్నారా.. అసులు OPS అంటే ఏమిటి..