‘హార్లే-డేవిడ్‌సన్’ రైడర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే బైక్‌ల విక్రయాలు.. ఏ కంపెనీ అమ్మకాలు చేయనుందో తెలుసా..

|

Feb 03, 2021 | 8:09 PM

Hero MotoCorp:ప్రముఖ లగ్జరీ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ హార్లే డేవిడ్‌సన్ గతేడాది కరోనా ప్రభావంతో భారత్‌లో కార్యకలాపాలు నిలిపేసిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాల్లో

హార్లే-డేవిడ్‌సన్ రైడర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే బైక్‌ల విక్రయాలు.. ఏ కంపెనీ అమ్మకాలు చేయనుందో తెలుసా..
Follow us on

Hero MotoCorp:ప్రముఖ లగ్జరీ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ హార్లే డేవిడ్‌సన్ గతేడాది కరోనా ప్రభావంతో భారత్‌లో కార్యకలాపాలు నిలిపేసిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాల్లో ఈ సంస్థ కంపెనీల బైకులను విక్రయించేందుకు దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే భారత్‌లో హార్లే డేవిడ్‌సన్ వాహనాలను విక్రయించడానికి హీరో మోటోకార్ప్ లిమిటెడ్ ప్రత్యేకంగా వ్యాపార విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది.

దేశీయంగా ఉన్న హార్లే డేవిడ్‌సన్ వాహన ప్రియులకు సౌకర్యవంతంగా సేవలను అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. దీంతో హార్లే-డేవిడ్‌సన్ అభిమానులు పండగ చేసుకోనున్నారు. ఇన్ని రోజులు బైక్‌లు తీసుకున్న వినియోగదారులు బైక్ పార్ట్స్‌ దొరుకుతాయో లేదో అని ఆందోళన చెందారు. ఇప్పుడు హీరో నిర్ణయంతో వారికి ఇక ఏ దిగులు లేదు. అంతేకాకుండా హార్లే డేవిడ్‌సన్ బైక్‌లు కొనుగోలు చేయాలని భావించి వెనుదిరిగిన వారు హీరో నిర్ణయంతో తమ కోరికను నెరవేర్చుకోనున్నారు.

72 year Old Whisky: 72 ఏళ్ల నాటి విస్కీ బాటిల్.. వేలం పాటలో ఎంతకు అమ్ముడైందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు..