భారతదేశం నుంచి నవంబర్‌లో రికార్డు స్థాయిలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతి అయ్యాయి. ముఖ్యంగా రూ.20 వేల కోట్ల విలువైన ఆపిల్ కంపెనీకు సంబంధించిన ఫోన్లు ఎగుమతి అయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల విడుదలైన డేటా ప్రకారంస్మార్ట్‌ఫోన్ ఎగుమతులు రూ.20,300 కోట్లను దాటాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 90 శాతం ఎక్కువ. గత నెలలో యాపిల్ ఎగుమతుల్లో ముందుండగా శాంసంగ్ తర్వాతి స్థానంలో నిలిచింది. గతేడాది నవంబర్‌లో భారతదేశం నుంచి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు రూ.10,600 కోట్లకు పైగా ఉన్నాయి. దేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సింగిల్ డిజిట్ వార్షిక వృద్ధి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొడెక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం చాలా బాగా సక్సెస్ అయ్యిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యాపిల్ ఐ ఫోన్ ఉత్పత్తులు ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఈ ఏడు నెల కాలంలో 10 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. భారతదేశంలో గత ఆర్థిక సంవత్సరం 14 బిలియన్ల డాలర్ల విలువైన ఐఫోన్‌లను తయారు చేసింది. ఇందులో 10 బిలియన్ల డాలర్ల విలువైన ఐఫోన్‌లను ఎగుమతి చేసింది. ప్రీమియం 5జీ, ఏఐ స్మార్ట్‌ఫోన్‌లకు ఇటీవల డిమాండ్ పెరిగిన కారణంగా ఈ సంవత్సరం భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 7 నుంచి 8 శాతం వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారతదేశంలో మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్ స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 500 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ తయారీ లక్ష్యాన్ని సాధిస్తుందని పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా 2030 నాటికి టాప్ ఎగుమతిదారుల్లో భారతదేశం ఒకటిగా ఉంటుందని చెబుతున్నారు. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ డేటా ప్రకారం మొబైల్ ఫోన్ ఉత్పత్తి 2014-15లో రూ.18,900 కోట్ల నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.4.10 లక్షల కోట్లకు పెరిగింది. పీఎల్ఐ పథకం ద్వారా 2,000 శాతం భారీ పెరుగుదలను నమోదు చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి