HDFC Bank: ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకింగ్ దిగ్గజం HDFC.. సీనియర్ సిటిజన్లకు అదనంగా..

|

May 18, 2022 | 12:22 PM

HDFC Bank: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం HDFC తాజాగా వడ్డీ రేట్లను సవరించింది. రిజర్వు బ్యాంక్ రెపో రేటు పెంచిన తరువాత బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో మార్పేలు చేయటం ప్రారంభించాయి.

HDFC Bank: ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకింగ్ దిగ్గజం HDFC.. సీనియర్ సిటిజన్లకు అదనంగా..
Hdfc Bank
Follow us on

HDFC Bank: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం HDFC తాజాగా వడ్డీ రేట్లను సవరించింది. రిజర్వు బ్యాంక్ రెపో రేటు పెంచిన తరువాత బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో మార్పేలు చేయటం ప్రారంభించాయి. అదే బాటలో రెండు వారాల తరువాత దిగ్గజ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తొమ్మిది నెలలకు పైగా ఉన్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎఫ్‌డీల కోసం కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. కొత్త HDFC బ్యాంక్ FD వడ్డీ రేటు పెంపు డిపాజిట్ కాలాన్ని బట్టి 10 నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు మార్పు చేసింది. సీనియర్ సిటిజన్‌లు మాత్రం అదనంగా 0.50 శాతం రిటర్న్స్ పొందనున్నారు. HDFC బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు పెంపు మే 18, 2022 నుంచి అమల్లోకి వచ్చింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్‌లకు తాజా వడ్డీ రేట్లు వర్తిస్తాయని బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

బ్యాంక్ ప్రస్తుతం మార్పు తరువాత అందించే వడ్డీ రేట్ల వివరాలు:

  • 15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.00 శాతం
  • 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
  • 46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
  • 61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
  • 91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
  • 6 నెలల 1 రోజుల నుంచి 9 నెలల వరకు: సాధారణ ప్రజలకు – 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.90 శాతం
  • 9 నెలల 1 రోజు నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ కాలానికి: సాధారణ ప్రజలకు – 4.45 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
  • 1 సంవత్సరం: జనరల్ పబ్లిక్ కోసం – 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.60 శాతం
  • 1 సంవత్సరం 1 రోజు నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.60 శాతం
  • 2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 5.40 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.90 శాతం
  • 3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.10 శాతం
  • 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం

RBI రెపో రేటు పెంపు తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో పాటు ఇతర బ్యాంకులు ఇప్పటికే తమ FD రేట్లను పెంచాయి. తాజాగా HDFC బ్యాంక్ కూడా తన FD రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి