India Gold Imports: పసిడి దిగుమతిలో భారత్‌ 2వ స్థానం.. భారీగా పెరిగిన బంగారం దిగుమతులు

|

Apr 11, 2022 | 11:36 AM

India Gold Imports: భారతీయులు బంగారానికి ఎంతో విలువ ఇస్తుంటారు. కొనుగోళ్లు భారీగా జరుపుతుంటారు. ఇక 2021-22 ఆర్థిక సంవత్సరంలో పసిడి..

India Gold Imports: పసిడి దిగుమతిలో భారత్‌ 2వ స్థానం.. భారీగా పెరిగిన బంగారం దిగుమతులు
Follow us on

India Gold Imports: భారతీయులు బంగారానికి ఎంతో విలువ ఇస్తుంటారు. కొనుగోళ్లు భారీగా జరుపుతుంటారు. ఇక 2021-22 ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు పెరిగాయి. దేశంలోకి పసిడి (Gold) దిగుమతులు 46.14 కోట్ల డాలర్లకు (సుమారు రూ.3,48,357 కోట్లు) చేరాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 33.34 శాతం ఎక్కువ. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు 34.62 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. పుత్తడి దిగుమతులు పెరిగిపోవడంతో వాణిజ్య లోటు 192.41 బిలియన్‌ డాలర్లకు ఎగిసింది. 2020-21లో లోటు 102.62 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

బంగారం వినియోగించే దేశాల్లో భారత్‌ 2వ స్థానం:

ప్రపంచంలో బంగారాన్ని ఎక్కువగా వినియోగించే దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఇక మొదటి స్థానంలో చైనా కొనసాగుతోంది. జువెలరీ పరిశ్రమ వల్ల దిగుమతులు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గణాంకాల ప్రకారం.. భారత్‌ కరెంట్‌ అకౌంట్‌ లోటు 23 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో జీడీపీలో ఇది 2.7శాతంగా ఉంది. ఈ లెక్కన .. బంగారం దిగుమతులు 2021 ఏప్రిల్‌ నుంచి 2022 ఫిబ్రవరి వరకు 842.28 టన్నులుగా నమోదైంది.

అదే 2020లో చూస్తే కేవలం 430 టన్నుల బంగారం మాత్రమే దిగుమతి అయ్యింది. అయితే కరోనా ఆంక్షలు సడలింపు, బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య పెరగడం వంటి అంశాల కారణంగా దేశంలోకి దిగుమతులు భారీగా పెరిగాయని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో ఇదే ట్రెండ్‌ కొనసాగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ ఉండటంతో పసిడి కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.  మన దేశానికి దిగుమతి అయ్యే  బంగారంలో ఎక్కువ భాగం నగల తయారీకి వినియోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Russia-Ukraine War Effect: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌.. 23 శాతం పెరిగిన వంట నూనె ధరలు

Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్థిరంగా ఉన్న బంగారం.. పెరిగిన వెండి ధర..!