LIC IPO: వచ్చే వారమే ఎల్‌ఐసీ ఐపీఓ.. పాలసీదారులకు రూ.60, ఉద్యోగులు రూ.45 సబ్సిడీ..

|

Apr 27, 2022 | 4:57 PM

పెట్టుబడిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్న LIC IPO వచ్చే వారం ప్రారంభం కానుంది. షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ మే 4న ప్రారంభమై మే 9న ముగియనుంది...

LIC IPO: వచ్చే వారమే ఎల్‌ఐసీ ఐపీఓ.. పాలసీదారులకు రూ.60, ఉద్యోగులు రూ.45 సబ్సిడీ..
Lic Ipo
Follow us on

పెట్టుబడిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్న LIC IPO వచ్చే వారం ప్రారంభం కానుంది. షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ మే 4న ప్రారంభమై మే 9న ముగియనుంది. మే 17న ఎల్‌ఐసీ షేర్లు (LIC Shares) స్టాక్‌ మార్కెట్‌లో నమోదు కానున్నాయి. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ‘పెట్టుబడులు- ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం’ (DIPAM‌) కార్యదర్శి తుహిన్‌కాంత పాండే వెల్లడించారు. ఈ IPO ద్వారా 21 వేల కోట్ల రూపాయలను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పరిమాణంతో LIC IPO దేశంలోనే అతిపెద్ద IPOగా అవతరించనుంది. ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.902-949గా నిర్ణయించారు. కనీసం 15 షేర్లకు బిడ్‌ వేయాల్సి ఉంటుంది. అంటే గరిష్ఠ ధర వద్ద మదుపర్లు కనీసం రూ.14,235 పెట్టుబడిగా పెట్టాలి. విజయవంతమైన బిడ్డర్ల డీమ్యాట్‌(Dmat) ఖాతాల్లోకి షేర్లు మే 16న బదిలీ అవుతాయి. మే 17న స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఎల్‌ఐసీ లిస్ట్ కానుంది.

రిటైల్‌ విభాగంలో తన పాలసీదారులు కోసం ఎల్‌ఐసీ ప్రత్యేకంగా షేర్లను జారీ చేయనుంది. ఇందుకోసం ఇష్యూ పరిమాణంలో 2.21 కోట్ల (0.35%) షేర్లను కేటాయించింది. వీరికి ఒక్కో షేరుపై రూ.60 రాయితీ కూడా ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ పాలసీలకు ప్రీమియం చెల్లిస్తున్న పాలసీదారులు ఎల్‌ఐసీలో వాటాదారులుగా మారేందుకు అవకాశం లభించింది. తమ ఉద్యోగుల కోసం కూడా ఎల్‌ఐసీ ప్రత్యేకంగా 15.81 లక్షల (0.025%) షేర్లను కేటాయించింది. వీరికి ఒక్కో షేరుపై రూ.45 రాయితీ దక్కనుంది. రిటైల్‌ మదుపర్లకు కూడా ఇంతే మొత్తంలో రాయితీ లభించనుంది. ఇంతకు ముందు కూడా దేశంలో చాలా పెద్ద IPOలు జరిగాయి. కానీ అవన్నీ రూ.20 వేల కోట్లలోపే సేకరించాయి. ఇప్పటివరకు 10 వేల కోట్ల రూపాయలకు పైగా 5 IPOలు వచ్చాయి.

దేశంలోని టాప్ 5 అతిపెద్ద పబ్లిక్ ఇష్యూలు

1.One 97 కమ్యూనికేషన్స్ – One 97 కమ్యూనికేషన్స్ అంటే Paytm ప్రస్తుతం ఇప్పటి వరకు అతిపెద్ద IPOగా ఉంది.

2.కోల్ ఇండియా – కోల్ ఇండియా IPO నవంబర్ 2010లో వచ్చింది. ఆ తర్వాత కంపెనీ మార్కెట్ నుంచి రూ.15,199 కోట్లు సమీకరించింది.

3.రిలయన్స్ పవర్ – ఫిబ్రవరి 2008లో వచ్చిన రిలయన్స్ పవర్ మూడో అతిపెద్ద IPOగా ఉంది.

4.జనరల్ ఇన్సూరెన్స్ – జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ IPO ఇప్పటి వరకు దేశంలో నాల్గో అతిపెద్ద IPOగా ఉంది.

5.SBI కార్డ్‌లు- SBI కార్డ్‌ల IPO మార్చి 2020లో వచ్చింది. ఇష్యూ పరిమాణం రూ.10,355 కోట్లు.

Read Also.. Akshaya Tritiya sales: బంగారం, అభరణాల కొనుగోలుదారులకు అదిరిపోయే శుభవార్త.. భారీ ఆఫర్లు!