
డి-అడిక్షన్ కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంది. అంటే మద్యం, పొగాకు ఉత్పత్తులను మాన్పించి వారికి చికిత్స నిర్వహించేందుకు, అలాగే కౌన్సిలింగ్ నిర్వహించే విధంగా చర్యలు చేపడుతూనే ఉంది. దీని కోసం అనేక ప్రచారాలు కూడా నిర్వహిస్తోంది. కానీ, ఇప్పటికీ ప్రజలు తమ సంపాదనలో పాన్, పొగాకు, ఇతర మత్తు పదార్థాలకే ఎక్కువ భాగం వెచ్చిస్తున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని తీవ్ర హెచ్చరికలు చేసినా ప్రజలు పట్టించుకోవడం లేదు. గత 10 సంవత్సరాలలో ఈ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయని మీరు దీన్ని బట్టి ఊహించవచ్చు. ప్రభుత్వ నివేదికల ప్రకారం, గత 10 సంవత్సరాలలో పాన్, పొగాకు, ఇతర మత్తు పదార్థాలపై ఖర్చు పెరిగింది. ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఇలాంటి ఉత్పత్తులకే వెచ్చిస్తున్నారు. గత వారం విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే 2022-23 మొత్తం గృహ వ్యయంలో భాగంగా పాన్, పొగాకు, మత్తు పదార్థాలపై ఖర్చు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పెరిగినట్లు చూపిస్తుంది.
పాకెట్ మనీ బాగా పెరిగిపోయింది
డేటా ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వస్తువులపై వ్యయం 2011-12లో 3.21 శాతం నుండి 2022-23 నాటికి 3.79 శాతానికి పెరిగింది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఖర్చు 2011-12లో 1.61 శాతం నుండి 2022-23 నాటికి 2.43 శాతానికి పెరిగింది.
విద్యపై ఖర్చు తగ్గింది
పట్టణ ప్రాంతాల్లో విద్యపై వ్యయం నిష్పత్తి 2011-12లో 6.90 శాతం నుంచి 2022-23 నాటికి 5.78 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిష్పత్తి 2011-12లో 3.49 శాతం నుంచి 2022-23 నాటికి 3.30 శాతానికి తగ్గింది. గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) ఆగస్టు, 2022 నుండి జూలై, 2023 వరకు గృహ వినియోగ వ్యయ సర్వే (HCES)ని నిర్వహించింది.
ప్యాక్ చేసిన ఆహారంపై ఖర్చు
గృహ వినియోగ వ్యయానికి సంబంధించిన ఈ సర్వే ఉద్దేశ్యం ప్రతి కుటుంబం నెలవారీ తలసరి వినియోగ వ్యయం (MPCE) గురించి సమాచారాన్ని పొందడం. దీని కింద దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, వివిధ సామాజిక-ఆర్థిక సమూహాలకు భిన్నమైన పోకడలు గుర్తించబడతాయి. పట్టణ ప్రాంతాల్లో పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారంపై 2011-12లో 8.98 శాతంగా ఉన్న వ్యయం 2022-23 నాటికి 10.64 శాతానికి పెరిగిందని సర్వే పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 2011-12లో 7.90 శాతం నుంచి 2022-23 నాటికి 9.62 శాతానికి పెరిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి