Stock Market: రెండు రోజుల పాటు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. వారాతంలో మళ్లీ నష్టాల బాటపట్టాయి. ఉదయం 9.30 సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్(Sensex) 525 పాయింట్లు నష్టపోయి 57388 వద్ద ట్రేడ్ అవుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ(Nifty) 166 పాయింట్లు నష్టపోయి 17226 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 492 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 120 పాయింట్ల మేర నష్టపోయాయి. దీనికి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎదురవుతున్న ప్రతికూల పరిణామాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మార్కెట్లు ఆరంభంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ప్రధానంగా ఫోకస్ లో ఉన్నాయి.
స్టాక్ మార్కెట్ల ఆరంభంలో అదానీ పోర్ట్స్ 2.92%, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 2.89%, టెక్ మహీంద్రా 0.66%, ఓఎన్జీసీ 0.60%, జీ ఎంటర్టైన్ మెంట్ 0.37%, టాటా స్టీల్ 0.32%, భారతీ ఎయిర్ టెల్ 0.29%, పవర్ గ్రిడ్ 0.26%, గెయిల్ 0.21%, విప్రో 0.14% మేర పెరిగి ఆరంభంలో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో.. హిందాల్కో 3.44%, ఐచర్ మోటార్స్ 2.28%, డాక్టర్ రెడ్డీస్ 2.04%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.92%, మహీంద్రా అండ్ మహీంద్రా 1.80%, హీరో మోటొ కార్ప్ 1.65%, సిప్లా 1.62%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.47%, బజాజ్ ఆటో 1.45%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.44% మేర ఆరంభంలో నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.
ఇవీ చదవండి..
Six Airbags For Cars: కార్లలో 6 ఎయిర్ బ్యాగ్‌లు.. ఆరోజు నుంచే అమలులోకి కొత్త నిబంధనలు !
Ram Charan: RC15 అమృత్‌సర్ షెడ్యూల్ పూర్తి.. ఆచార్య ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌కు చెర్రీ.. నెట్టింట్లో వైరల్ ఫొటో..