Stock Market Timings: నాలుగు రోజుల విరామం తరువాత తెరుచున్న భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్ 1000 పాయింట్లకుపైగా నష్టపోగా.. మరో సూచీ నిఫ్టీ 270 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 660, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 330 పాయింట్లకు పైగా నష్టపోయాయి. నేటి నుంచి స్టాక్ మార్కెట్లు ఉదయం 9 నుంచి ట్రేడింగ్ ప్రారంభమవుతాయని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. రోజులో ట్రేడింగ్ వేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 వరకు ఉన్నాయి. గతంలో ఈ వేళలు ఉదయం 9.15 నుంచి సాయంత్రం 3.30గా ఉండేవి. జీఎస్టీ రేట్ల పెంపు, బంగారం ధర నెల రోజుల గరిష్ఠాన్ని తాకటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్ కంపెనీ షేర్లు ప్రధానంగా ఫోకస్ లో ఉన్నాయి.
ప్రభావితం చేసిన కారణాలివే..
దేశీయంగానూ ద్రవ్యోల్బణం వంటి గణాంకాలు సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. అటు అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం నమోదవుతుండడంతో మార్కెట్లలో జాగ్రత్త కనిపిస్తోంది. పరపతి విధానం కఠినంగా ఉండొచ్చన్న అంచనాల మధ్య విదేశీ నిధుల ప్రవాహం స్తబ్ధుగానే ఉండొచ్చని భావిస్తున్నారు. రష్యా- ఉక్రెయిన్ పరిణామాలపైనా మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు కొనసాగొచ్చు. మార్చితో ముగిసిన త్రైమాసికంలో చైనాలో ఆర్థిక వృద్ధి మందగించిందన్న గణాంకాలూ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. అక్కడ భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండడం.. షాంఘై ఇంకా ఆంక్షల్లోనే కొనసాగుతుండడం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
గమనించాల్సిన షేర్స్..
ఇవీ చదివింది..
Covid-19: కరోనా వచ్చినప్పుడు వాసన కోల్పోయారా.. వాటి డ్యామేజ్ వల్లేనేనంటున్న పరిశోధనలు..