Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ల దిశ మార్చిన చమురు, IT షేర్లు..

Stock Market: ఆసియా మార్కెట్ల ప్రతికూలతలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. చివరికి లాభాల్లో క్లోజ్ అయ్యాయి. ప్రధానంగా చమురు, ఆటీ సెక్టార్లలోని స్టాక్స్ మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి.

Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ల దిశ మార్చిన చమురు, IT షేర్లు..
stock market

Updated on: Jun 02, 2022 | 4:54 PM

Stock Market: ఆసియా మార్కెట్ల ప్రతికూలతలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. చివరికి లాభాల్లో క్లోజ్ అయ్యాయి. గత రెండు రోజులుగా వరుస నష్టాలను చవిచూసిన దేశీయ ఈక్విటీ మార్కెట్ ఈ రోజు అర శాతంపైగా లాభాలతో ముగిసింది. IT, చమురు, గ్యాస్ రంగాలకు చెందిన స్టాక్స్ పాజిటివ్ పనితీరుతో నిఫ్టీ సూచీ 16,600 పాయింట్ల పైన స్థిరపడింది. అయితే బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడి 55,800 వద్ద లాభాల్లో ముగిసింది.

బెంచ్‌మార్క్ సూచీల తరువాత.. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.7%, స్మాల్‌క్యాప్ సూచీ 0.6% మేర ఈ రోజు పెరిగాయి. ఇక రంగాలవారీగా చూస్తే.. నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ స్టాక్‌లు అత్యధికంగా లాభపడ్డాయి. ఇండెక్స్ దాదాపు రెండు శాతం లాభంతో ముగియగా, ఇదే దోరణిని IT సెక్టార్ కూడా అనుసరించి 1.5% లాభంతో స్థిరపడింది.

స్టాక్‌లలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ బెంచ్‌మార్క్‌ సూచీల ర్యాలీకి దోహదపడింది. ఈ క్రమంలో షేరు 3.5% కంటే ఎక్కువగానే లాభపడింది. బజాజ్ ఫిన్‌సర్వ్, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి. ఇదే సమయంలో.. నిఫ్టీ-50లో అపోలో హాస్పిటల్స్ టాప్ లూజర్‌గా నిలిచింది. హీరో మోటొకార్ప్, ఐషర్ మోటార్స్, పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంకులు ఈ రోజు టాప్ లూజర్స్ గా నిలిచాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.