Stock Market: రోజంతా ఊగిసలాటలో సూచీలు.. వారాంతంలో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

|

May 13, 2022 | 4:25 PM

Stock Market: ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కె్ట్లు.. జోష్ ను కొనసాగించలేకపోయాయి. రోజంతా ఊగిసలాడిన మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి.

Stock Market: రోజంతా ఊగిసలాటలో సూచీలు.. వారాంతంలో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Stock Market
Follow us on

Stock Market: ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కె్ట్లు.. జోష్ ను కొనసాగించలేకపోయాయి. రోజంతా ఊగిసలాడిన మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు ఊతం ఇవ్వటం, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు సెంట్రల్ బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలతో మదుపరులు ఉత్సాహంగా కొనుగోళ్లకు మెుగ్గు చూపారు. కానీ చివరికి కీలక మార్కెట్ సూచీలు నష్టాల బాట పట్టాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 137 పాయింట్ల మేర కోల్పోగా, మరో సూచీ నిఫ్టీ-50.. స్వల్పంగా 26 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 410 పాయింట్లు నష్టపోయాయి. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 275 పాయింట్లు లాభంతో ముగియటం గమనార్హం.

స్టాక్ మార్కెట్లో టాటా మోటార్స్ 8.60%, సన్ ఫార్మా ఇండస్ట్రీస్ 3.82%, మహీంద్రా అండ్ మహీంద్రా 2.80%, హిందుస్థాన్ యూనీలివర్ 2.59%, ఐటీసీ 2.25%, యూపీఎల్ 2.17%, టైటాన్ కంపెనీ 2.11%, ఐషర్ మోటార్స్ 2.01%, హీరో మోటొకార్ప్ 2.00%, బజాజ్ ఆటో 1.59% మేర లాభపడి నిఫ్టీ సూచీలో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో ఇండస్ టవర్స్ 9.28%, వేదాంతా 6.79%, హిందాల్కొ 4.40%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.89%, ఎన్టీపీసీ 2.96%, ఐసీఐసీఐ బ్యాంక్ 2.65%, భారతీ ఎయిర్ టెల్ 2.20%, యాక్సిస్ బ్యాంక్ 2.11%, మారుతీ సుజుకీ 2.09%, బజాజ్ ఫిన సర్వ్ 1.89% మేర నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.

ఇవీ చదవండి..

Elon Musk: ట్విట్టర్ ను వీడుతున్న సీనియర్లు.. కొత్త నియామకాలు బంద్.. అసలు ఏం జరుగుతోందంటే..

Salary Hike: ఇంక్రిమెంట్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు శుభవార్త..