Debt States: దేశంలో అత్యధిక అప్పులున్న రాష్ట్రాలు.. అగ్రస్థానంలో ఏ రాష్ట్రం.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?

Debt States: మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిశా వంటి రాష్ట్రాలు అప్పులు చేస్తున్నప్పటికీ, వాటి ఆదాయంతో పోలిస్తే అప్పుల నిష్పత్తి నియంత్రణలోనే ఉంది. కర్ణాటక కూడా ఈ విషయంలో స్థిరమైన ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోంది. అభివృద్ధి పనుల కోసం అప్పులు చేయడం..

Debt States: దేశంలో అత్యధిక అప్పులున్న రాష్ట్రాలు.. అగ్రస్థానంలో ఏ రాష్ట్రం.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?
Debt States

Updated on: May 11, 2026 | 2:43 PM

Debt States: భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఇటీవల ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో, ఆ రాష్ట్ర అప్పుల భారంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ క్రమంలో దేశంలో అత్యధికంగా అప్పులు ఉన్న రాష్ట్రాలు ఏవి? ఏయే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

భారత రాష్ట్రాలలో తమిళనాడు అత్యధిక రుణభారం గల రాష్ట్రం. అయితే, తమ ఆదాయానికి మించి అప్పులు చేసిన రాష్ట్రాలు కూడా జాబితలో ఉన్నాయి. ఒక రాష్ట్రం తన జీడీపీతో పోలిస్తే ఎంత అప్పు కలిగి ఉంది? అలాగే దాని నిష్పత్తి ఎంత అనే దాని ఆధారంగా రుణ తీవ్రతను లేదా ప్రమాదాన్ని లెక్కించవచ్చు.

అత్యధిక అప్పు ఉన్న టాప్ 10 రాష్ట్రాల జాబితా:

తాజా గణంకాల ప్రకారం, రాష్ట్రాల వారీగా ఉన్న అప్పుల (రూపాయిల విలువలో) వివరాలు ఇలా ఉన్నాయి:

  1. తమిళనాడు: రూ. 9.6 లక్షల కోట్లు
  2. ఉత్తరప్రదేశ్: రూ. 8.6 లక్షల కోట్లు
  3. మహారాష్ట్ర: రూ. 8.1 లక్షల కోట్లు
  4. కర్ణాటక: రూ. 7.3 లక్షల కోట్లు
  5. పశ్చిమ బెంగాల్: రూ. 7.1 లక్షల కోట్లు
  6. రాజస్థాన్: రూ. 6.4 లక్షల కోట్లు
  7. ఆంధ్రప్రదేశ్: రూ. 5.6 లక్షల కోట్లు
  8. మధ్యప్రదేశ్: రూ. 5.3 లక్షల కోట్లు
  9. గుజరాత్: రూ. 4.9 లక్షల కోట్లు
  10. కేరళ: రూ. 4.7 లక్షల కోట్లు

అప్పు Vs జీఎస్డీపీ (GSDP) నిష్పత్తి అంటే ఏమిటి?

కేవలం అప్పు మొత్తాన్ని చూసి ఒక రాష్ట్రం ఆర్థికంగా ప్రమాదంలో ఉందని చెప్పలేము. ఆ రాష్ట్ర ఆదాయం (GSDP – Gross State Domestic Product) ఎంత? ఆ ఆదాయానికి అప్పుకు ఉన్న నిష్పత్తి ఎంత? అనేదే అసలైన కొలమానం. ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఎక్కువ అప్పు చేసినా దానిని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా ఈ నిష్పత్తి 30% కంటే తక్కువగా ఉంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా ఉన్నట్లు భావిస్తారు.

ఆందోళనకరంగా ఉన్న రాష్ట్రాలు:

  • అప్పు-జీఎస్డీపీ నిష్పత్తి ప్రకారం చూస్తే కొన్ని రాష్ట్రాలు పరిమితికి మించి అప్పులు చేసినట్లు తెలుస్తోంది. అందులో..
  • పశ్చిమ బెంగాల్, కేరళ: ఈ రెండు రాష్ట్రాల్లో అప్పుల నిష్పత్తి 30% కంటే ఎక్కువగా ఉంది.
  • పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్: ఈ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కూడా అప్పుల భారంతో ఒత్తిడికి లోనవుతోంది.

మెరుగైన స్థితిలో ఉన్నవి:

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిశా వంటి రాష్ట్రాలు అప్పులు చేస్తున్నప్పటికీ, వాటి ఆదాయంతో పోలిస్తే అప్పుల నిష్పత్తి నియంత్రణలోనే ఉంది. కర్ణాటక కూడా ఈ విషయంలో స్థిరమైన ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోంది. అభివృద్ధి పనుల కోసం అప్పులు చేయడం సాధారణమే అయినా, అవి రాష్ట్ర ఆదాయానికి మించి ఉండకూడదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న అప్పుల భారం భవిష్యత్తులో సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభావం చూపవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us