Rupee Falls: ఈ రోజు డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనంగా ప్రారంభమైంది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ వద్ద.. రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 77.81 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ఆపై 77.82 వద్ద కోట్‌కు పడిపోయింది. రూపాయి ఆల్-టైమ్ కనిష్ఠ స్థాయి, చివరి ముగింపు నుంచి 8 పైసల పతనాన్ని నమోదు చేసింది. ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్‌లో యుఎస్ డాలర్‌తో రూపాయి 8 పైసలు క్షీణించి రికార్డు స్థాయిలో 77.82 వద్దకు చేరుకుంది. గురువారం నాడు అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు తగ్గి 77.74 వద్ద ముగిసింది.
ఆసియా, వర్ధమాన మార్కెట్లు మిశ్రమంగా ప్రారంభమయ్యారు. అయితే.. ఆసియా ఈక్విటీ మార్కెట్ ఒత్తిడిలో ఉంది. ఇది సెంటిమెంట్‌లను ప్రభావితం చేయగలదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.66 శాతం తగ్గి 122.26 డాలర్లకు చేరుకుంది. ఈ తరుణంలో ఆరు కరెన్సీల బాస్కెట్‌తో గ్రీన్‌బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.04 శాతం తగ్గి 103.17 వద్ద ట్రేడవుతోంది.
దేశీయ ఈక్విటీ మార్కెట్ లోని బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 620 పాయింట్లు క్షీణించి 54,699.60 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో NSE నిఫ్టీ సూచీ 165 పాయింట్లు క్షీణించి 16,312.80 వద్ద ఉంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం క్యాపిటల్ మార్కెట్‌లో నికర అమ్మకందారులుగా ఉన్నారు. వారు ఈ సమయంలో రూ. 1,512.64 కోట్ల విలువైన షేర్లను ఆఫ్‌లోడ్ చేసుకున్నారని తెలుస్తోంది.