Indian Railways: భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంది. సామాన్యుడికి సైతం అనువుగా ఉండేది రైలు ప్రయాణం. ఛార్జీలు తక్కువగా ఉన్నందున సాధారణ ప్రజలు ఎక్కువగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఇక అప్పుడప్పుడు కొన్ని రైళ్లు రద్దు అవుతుంటాయి. ఎందుకంటే రైల్వే ట్రాక్ మరమ్మతులు, వరదలు, భారీ వర్షాలు ఇతర కారణాల వల్ల కొన్ని రైళ్లు రద్దవుతుంటాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లీస్తుంటారు. ఇక తాజాగా జూలై 26న (నేడు) మొత్తం 149 రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. ఇందులో 11 రైళ్లను రీ షెడ్యూల్ చేయగా, 34 రైళ్లను దారి మళ్లించాలని నిర్ణయించారు రైల్వే అధికారులు. ఇటువంటి సమయంలో రైలు ప్రయాణం చేసేవారు ముందుగా రైళ్ల రద్దు జాబితాను తెలుసుకుని వెళ్లడం మంచిది. ఇలా చేయకుంటే తర్వాత సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. రద్దు చేయబడిన రైళ్లలో అన్ని రకాల మెయిల్ రైళ్లు, ప్రీమియం మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చాలా రైళ్లు రద్దు చేయబడ్డాయి.
ఈరోజు 149 రైళ్లు రద్దు కాగా, 34 దారి మళ్లించారు. ఈ రద్దయిన రైళ్ల జాబితాలో మహారాష్ట్రలోని రైలు నంబర్ 01539 పూణే-సతారా, రైలు నెంబర్ 01540 సతారా-పూణే, 01538 పూణే-ఫల్తాన్, రైలు నెంబర్ 01536 ఫాల్తాన్-ఫూనే, రైలు నెంబర్ 01538 ఫాల్తాన్-హోహ్నద్, ఇక రైలు నెంబర్ 03085 కల్వా-అజిమ్‌గంజ్, రైలు నెంబర్ 03592 అసన్నోల్-బొకారో స్టీల్ , రైలు నెంబర్ 05366 రాంనగర్-మొరాదాబాద్, సహా మొత్తం 149 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఇవేకాకుండా రైలు నెంబర్ 04133 కాన్పూర్ సెంట్రల్-ఫరూఖాబాద్, రైలు నెంబర్ 12419 లక్నో-ఢిల్లీ గోమతి ఎక్స్‌ప్రెస్ సహా 11 రైళ్లను రీ షెడ్యూల్ చేశారు. మొత్తం 34 రైళ్లను వివిధ కారణాలవల్ల దారి మళ్లించడం జరిగిందని రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికులు ముందస్తుగా జాబితాను తనిఖీ చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొకుండా ఉంటారని సూచించింది. జాబితాను తనిఖీ చేసేందుకు ప్రయాణికులు వెబ్ సైట్‌ను తనిఖీ చేయడం వల్ల తెలుసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..