Indian Railways: రైళ్లల్లో వీరికి టికెట్లపై 50 శాతం రాయితీ.. కేవలం ఈ వయస్సుల వారికి మాత్రమే.. ఎలానో చూడండి..

రైళ్లలో పిల్లలతో ప్రయాణించే వారికి టికెట్ నిబంధనలపై గందరగోళం సర్వసాధారణంగా ఉంటుంది. టికెట్ బుకింగ్ చేసేటప్పుడు సరైన వయసు నమోదు చేయడంతో పాటు వయసు ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవడం ముఖ్యం. పిల్లలకు వయస్సుల వారీగా రైల్వే టికెట్లకు సంబంధించి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

Indian Railways: రైళ్లల్లో వీరికి టికెట్లపై 50 శాతం రాయితీ.. కేవలం ఈ వయస్సుల వారికి మాత్రమే.. ఎలానో చూడండి..
Indian Railways Ticket Rule

Updated on: Oct 11, 2026 | 9:47 AM

భారతీయ రైల్వే వ్యవస్థ దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రవాణా సాధనాలలో ఒకటిగా ఉంది. రైళ్లలో ప్రయాణం సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉంటుందని చాలామంది భావిస్తారు. అయితే రైళ్లలో ప్రయాణించేటప్పుడు అనేక నియమ, నిబంధనలు అమల్లో ఉంటాయి. ముఖ్యంగా పిల్లలతో కలిసి ప్రయాణించేవారు.. పిల్లల టికెట్ల విషయంలో కన్‌ప్యూజన్ ఉంది. ఎంత వయసు పిల్లలకు టికెట్ అవసరం లేదు..? ఎవరికి హాఫ్ టికెట్ తీసుకోవాలి..? పూర్తి టికెట్ ఎప్పుడు అవసరం? అనే విషయాలపై అవగాహన ఉండదు. ప్రయాణికుల సౌలభ్యం, రైళ్ల నిర్వహణ కోసం రైల్వేశాఖ పిల్లల టికెట్ల విషయంలో కొన్ని నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. రైల్వే నిబంధనల ప్రకారం.. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు రైలు టికెట్ అవసరం లేదు. తల్లిదండ్రులతో పాటు ఎక్కడినుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇలా ఉచిత ప్రయాణానికి పిల్లలకు ప్రత్యేకమైన బెర్త్‌ను కేటాయించదు. తల్లిదండ్రులు బెర్త్‌లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు తమ చిన్న పిల్లలకు కూడా ప్రత్యేకమైన బెర్త్ సౌకర్యం కావాలనుకుంటే.. అప్పుడు టికెట్ ధర మొత్తం చెల్లించి బెర్త్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఐదు సంవత్సరాలు నిండినప్పటి నుండి పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు రైలు టికెట్ విషయంలో వేర్వేరు నిబంధనలు వర్తిస్తాయి. ఈ వయసు పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చు. కానీ ఈ వయస్సు వారికి కూడా ప్రత్యేక సీటు లేదా బెర్త్ కేటాయించరు. ప్రత్యేక బెర్త్ లేదా సీటు అవసరం అనుకుంటే మొత్తం టికెట్ ధర చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పన్నెండు సంవత్సరాలు నిండిన పిల్లలు భారతీయ రైల్వేలో ప్రయాణించాలంటే తప్పనిసరిగా పూర్తి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. వారిని పెద్దలతో సమానంగా పరిగణిస్తారు కాబట్టి పూర్తి టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో రైలు టికెట్లను బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికుల వివరాలను, ముఖ్యంగా పిల్లల వయసును సరిగ్గా నమోదు చేయడం అత్యంత కీలకం. తప్పు వయసు నమోదు చేసినట్లయితే.. రైలులో టికెట్ తనిఖీ చేసే సమయంలో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) జరిమానా విధిస్తారు. టీటీఈకి పిల్లల వయసుపై ఏమాత్రం అనుమానం ఉన్నా..  వయసు ధ్రువీకరణ పత్రాలను అడగవచ్చు.

పిల్లలతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డు లాంటి ఏదైనా గుర్తింపు ధృవీకరణ పత్రం తీసుకెళ్లడం మంచిది. దూరపు ప్రయాణాలు చేసే సమయంలో పిల్లలకు ప్రత్యేక టికెట్, బెర్త్ బుక్ చేయడం వల్ల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది పిల్లలకు విశాలమైన స్థలాన్ని అందించి.. అలసట లేకుండా ప్రయాణించడానికి సహాయపడుతుంది. పిల్లలతో కలిసి రైలులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ రైల్వే నిబంధనల గురించి అవగాహన కలిగి ఉండాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us