Indian Railways: రైలులో రాత్రి 10 దాటితే ఇవి అస్సలు చేయకూడదు.. ప్రయాణికులు తప్పక తెలుసుకోవాల్సిన నిబంధనలు!

Indian Railways: మీరు రైలులో ప్రయాణిస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. చాలా మంది దూర ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. కానీ రాత్రి వేళల్లో రైల్వే నిబంధనలు వేరుగా ఉంటాయని మీకు తెలుసా? రాత్రి పూట రైలు ప్రయాణం చేసేవారు ఈ నిబంధనలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

Indian Railways: రైలులో రాత్రి 10 దాటితే ఇవి అస్సలు చేయకూడదు.. ప్రయాణికులు తప్పక తెలుసుకోవాల్సిన నిబంధనలు!
Indian Railways Rules

Updated on: Aug 29, 2026 | 4:38 PM

Indian Railways: రైలులో ప్రయాణించడానికి రైలు టిక్కెట్టు అవసరం. అలాగే అనేక మార్గాలలో మనం రైలు టిక్కెట్లను నెలల ముందుగానే బుక్ చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో మీరు కూడా రైలులో ప్రయాణిస్తే, రాత్రి 10 గంటల తర్వాత రైళ్లలో వర్తించే కొన్ని నియమాల గురించి మీరు తెలుసుకోవడం ముఖ్యం. అవేంటో తెలుసుకుందాం..

రైళ్లలో రాత్రి 10 గంటల తర్వాత ఏ నియమాలు వర్తిస్తాయి?

1. రాత్రి 10 గంటల తర్వాత రైలులోని ప్రధాన లైట్లను ఆపివేస్తారు. అంతేకాకుండా, ఛార్జింగ్ పాయింట్లు రాత్రి 11 గంటలకు మూసివేస్తారు. అంటే మీరు రాత్రిపూట మీ మొబైల్, ల్యాప్‌టాప్ మొదలైనవాటిని ఛార్జ్ చేసుకోలేరు. ప్రయాణికులు సౌకర్యవంతంగా నిద్రపోవడానికి లైట్లు ఆఫ్‌ చేస్తారు. భద్రతా కారణాల దృష్ట్యా ఛార్జింగ్ పాయింట్లను కూడా మూసివేస్తారు.

2. రాత్రిపూట రైలులో గట్టిగా మాట్లాడకూడదు. మొబైల్‌లో కాల్స్‌లో మాట్లాడటం, సంగీతం వినడం లేదా స్పీకర్‌పై శబ్దం చేయడం కుదరదు. మీరు ప్రయాణికుడి నిద్రకు భంగం కలిగిస్తే, మీపై చర్య తీసుకోవచ్చు. అందుకే సమయంలో తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించకూడదు.

ఇవి కూడా చదవండి

3. మీకు మధ్య సీటు లభించినట్లయితే, దానిని తెరవడానికి, మూసివేయడానికి కూడా సమయ పరిమితి ఉంటుందని తెలుసుకోండి. మీరు మధ్య బెర్త్‌ను రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు తెరవవచ్చు. ఈ విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. దీనివల్ల ప్రయాణ సమయంలో ఇబ్బందులు కలుగుతాయి.

4. TTEలు రాత్రిపూట ప్రయాణికులను నిద్రలేపి వారి టిక్కెట్లను తనిఖీ చేయకూడదు. రాత్రి 10 గంటల తర్వాత TTE ఏ ప్రయాణికుడి టిక్కెట్టును తనిఖీ చేయలేరు. అయితే, ఈ నియమం రాత్రి 10 గంటల లోపు రైలు ఎక్కే ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. మీరు రాత్రి 10 గంటల తర్వాత రైలు ఎక్కితే, మీ టిక్కెట్టును తనిఖీ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Success Story: ఒకే దుకాణం.. నాలుగు వ్యాపారాలు.. నెలకు రూ.4 లక్షల ఆదాయం.. గ్రాడ్యుయేట్ సక్సెస్ సీక్రెట్ ఇదే!

ఇది కూడా చదవండి: Gold Price: సెప్టెంబర్‌లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us