AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: ఒకే దుకాణం.. నాలుగు వ్యాపారాలు.. నెలకు రూ.4 లక్షల ఆదాయం.. గ్రాడ్యుయేట్ సక్సెస్ సీక్రెట్ ఇదే!

Success Story: బిజినెస్ చేయాలంటే కేవలం ఒకే రకమైన ఐడియాపై ఆధారపడాల్సిన అవసరం లేదు. మార్కెట్ అవసరాలను, కస్టమర్ల ట్రెండ్‌ను సరిగ్గా అంచనా వేసి మన ప్రణాళికలను మార్చుకుంటే నష్టాలు రాకుండా ఎల్లప్పుడూ లాభాల్లో ఉండవచ్చు" అని నితేష్ చెబుతున్నాడు. వ్యాపారం ప్రారంభించాలనుకునే..

Success Story: ఒకే దుకాణం.. నాలుగు వ్యాపారాలు.. నెలకు రూ.4 లక్షల ఆదాయం.. గ్రాడ్యుయేట్ సక్సెస్ సీక్రెట్ ఇదే!
Business Ideas
Subhash Goud
|

Updated on: Aug 27, 2026 | 1:47 PM

Share

Success Story: చాలామంది ఒక బిజినెస్ ప్రారంభించి, అది ఏడాదంతా నడవకపోతే తీవ్ర నష్టాలు చవిచూస్తుంటారు. కానీ వాతావరణం మారినట్లే తన వ్యాపారాన్ని మారుస్తూ ఏడాది పొడవునా నిరంతర ఆదాయాన్ని పొందుతున్నాడు నితేష్ భగత్ అనే యంగ్ బిజినెస్‌మ్యాన్. బీకామ్ (B.Com) చదివిన ఈ యువకుడు సాంప్రదాయ ఉద్యోగాల వైపు వెళ్లకుండా, తన మేధస్సుతో ‘సీజనల్ బిజినెస్ మోడల్’ను ఎంచుకుని నెలకు రూ.3 లక్షల నుండి రూ.4 లక్షల వరకు ఆదాయం గడిస్తున్నాడు.

ఎవరీ నితేష్ భగత్?

ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా (అంబికాపూర్) జిల్లాకు చెందిన నితేష్ భగత్ వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించాడు. బీకామ్ పూర్తి చేసిన తర్వాత స్వయం ఉపాధి సాధించాలనే లక్ష్యంతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. మార్కెట్‌లో కస్టమర్ల అవసరాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కాలానికి అనుగుణంగా మారుతుంటాయని గుర్తించిన నితేష్, “ఫోర్ సీజన్స్ బిజినెస్” మోడల్‌ను రూపొందించాడు.

ఏడాది పొడవునా 4 విభిన్న వ్యాపారాలు:

నితేష్ తన వ్యాపారాన్ని నాలుగు ప్రధాన సీజన్లుగా విభజించుకున్నాడు:

ఇవి కూడా చదవండి

వేసవి కాలం (Summer):

ఎండలు తీవ్రంగా ఉండే కాలంలో శీతల పానీయాల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ సీజన్‌లో నితేష్ జ్యూస్‌లు, చెరుకు రసం, లస్సీ, తాజా షర్బత్‌ల విక్రయ కేంద్రాన్ని నిర్వహిస్తాడు.

వర్షాకాలం (Monsoon):

వర్షాల సమయంలో వేడివేడి తినుబండారాలకు డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో టీ, కాఫీ, రకరకాల పకోడీలు, సమోసాలు, స్నాక్స్ విక్రయించే షాప్‌గా మారుస్తాడు.

చలికాలం (Winter):

చలికాలంలో శరీరానికి వేడిని అందించే ఆహార పదార్థాలు, సూప్‌లు, డ్రై ఫ్రూట్ ఆధారిత స్వీట్లు, గరం గరం స్ట్రీట్ ఫుడ్‌లను అందుబాటులో ఉంచుతాడు.

పండుగల సీజన్ (Festive Season):

దీపావళి, హోలీ, ఛట్ వంటి ప్రధాన పండుగల సమయంలో పూజా సామగ్రి, అలంకరణ వస్తువులు, స్వీట్లు, గిఫ్ట్ ప్యాక్‌లను పెద్ద ఎత్తున విక్రయిస్తాడు.

సంపాదన, విజయం:

ఈ నాలుగు రకాల వ్యాపారాల ద్వారా నితేష్ రోజువారీ విక్రయాలు భారీగా ఉంటాయి.

వార్షిక టర్నోవర్ / ఆదాయం: సీజన్‌ను బట్టి నెలకు సగటున రూ.3,00000 నుండి రూ.4,00000 వరకు సంపాదిస్తున్నాడు. ఒకే లొకేషన్‌లో లేదా స్థిరమైన సెటప్‌లో సీజన్‌కు తగ్గట్టు బోర్డులు, మెనూలు, ఉత్పత్తులను మార్చుకుంటూ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు.

యువతకు సందేశం:

“బిజినెస్ చేయాలంటే కేవలం ఒకే రకమైన ఐడియాపై ఆధారపడాల్సిన అవసరం లేదు. మార్కెట్ అవసరాలను, కస్టమర్ల ట్రెండ్‌ను సరిగ్గా అంచనా వేసి మన ప్రణాళికలను మార్చుకుంటే నష్టాలు రాకుండా ఎల్లప్పుడూ లాభాల్లో ఉండవచ్చు” అని నితేష్ చెబుతున్నాడు. వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు నితేష్ భగత్ ఈ ‘సీజనల్ బిజినెస్ స్ట్రాటజీ’ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.

Follow Us