Vande Bharat: సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు వచ్చే వందే భారత్ సమయ వేళల్లో మార్పు

Secunderabad – Visakhapatnam Vande Bharat: దేశంలోని వివిధ నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడం కోసం.. భారత రైల్వే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2019 ఫిబ్రవరిలో వందే భారత్ సర్వీసులను ప్రధాని మోదీ చేతుల మీదుగా..

Vande Bharat: సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు వచ్చే వందే భారత్ సమయ వేళల్లో మార్పు
Vande Bharat

Updated on: Feb 18, 2026 | 5:09 PM

Secunderabad – Visakhapatnam Vande Bharat: Vande Bharat Express: సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వారు రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే ఎలాంటి రిస్క్‌ లేకుండా ప్రయాణించవచ్చు. అలాగే రైల్వే ఛార్జీలు తక్కువగా ఉండటంతో చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అయితే ఇప్పుడప్పుడు రైళ్ల సమయ వేళలను మారుస్తుంటుంది రైల్వే శాఖ. రైలు ప్రయాణం చేసే వారు సమయ వేళలను తెలుసుకుని వెళ్లడం చాలా ముఖ్యం.

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో రద్దీని తగ్గించడానికి ఫిబ్రవరి 20వ తేదీ నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో రాక సమయ వేళను సవరించారు రైల్వే అధికారులు. రైలు నంబర్ 20707 సికింద్రాబాద్– విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాక సమయాలను సవరించాలని తూర్పు కోస్ట్ రైల్వే నిర్ణయించింది. విశాఖపట్నం చేరుకునే ప్రస్తుతం, సవరించిన సమయాలు ఈ విధంగా ఉన్నాయి. సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రాక సమయం ప్రస్తుతం మధ్యాహ్నం 1.45 గంటలకు ఉండగా, ఇప్పుడు 1.50 గంటలకు మార్చారు. ఈ సమయ వేళలు 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని, ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: బ్యాంకు అకౌంట్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం ఖచ్చితంగా తెలియాల్సిందే!

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా, దేశంలోని వివిధ నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడం కోసం.. భారత రైల్వే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2019 ఫిబ్రవరిలో వందే భారత్ సర్వీసులను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వందే భారత్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఇటీవలే వందే భారత్ స్లీపర్ రైళ్లను సైతం ప్రారంభించారు. పూర్తి ఏసీ బోగీలతో కూడిన వందే భారత్ రైళ్లలో సేవలు మిగతా రైళ్లతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉంటాయి. అయితే సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే వీటిలో టికెట్ల ధరలు కూడా ఎక్కువే.

ఇది కూడా చదవండి: Term Insurance: నెలకు రూ.1000 కడితే చాలు 1 కోటి రూపాయలు.. మీరు అప్పులు తీర్చాల్సిన అవసరమే లేదు!

ఇది కూడా చదవండి: Multibagger: తలరాతనే మార్చేసింది.. 1 లక్ష రూపాయలు రూ.14 కోట్లుగా మారింది..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us