Indian Railways: రైల్వే ప్రయాణికులకు మెరుగైన భద్రత.. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో భారీ కార్యక్రమం..

ఇండియన్ రైల్వే మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో భద్రత, రక్షణపై తనిఖీలు చేపట్టనుంది. ఈ మేరకు ప్రయాణికుల భద్రత, సౌకర్యాలపై ఆడిట్ నిర్వహించనుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాల సాయం కూడా తీసుకోనుంది. ఈ మేరకు రైల్వేశాఖ ప్రకటన చేసింది.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు మెరుగైన భద్రత.. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో భారీ కార్యక్రమం..
Railway Station (representative image)

Updated on: Jun 10, 2026 | 10:11 PM

రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతను మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేంటంటే.. దేశవ్యాప్తంగా అన్ని స్టేషన్లలో అగ్నిమాపక తనిఖీలు చేపట్టింది. ప్రయాణికుల భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతను, రక్షణను మరింత బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో అగ్నిమాపక భద్రతా తనిఖీలు చేపట్టేందుకు సిద్దమైంది. ప్రయాణికుల భద్రతను పెంచడం, రైల్వే ఆస్తులను పరిరక్షించడడంలో భాగంగా ప్రస్తుతం ఉన్న అగ్నిమాపక భద్రతా వ్యవస్థలను అంచనా వేయనున్నారు. అనంతరం రైల్వే స్టేషన్లో మెరుగుపరచాల్సిన అంశాలను రైల్వేశాఖ గుర్తించి చర్యలు చేపట్టనుంది.

రాష్ట్ర ప్రభుత్వాల నుంచి..

స్టేషన్ భవనాలు, విద్యుత్ వ్యవస్థలు, ఎయిర్ కండిషనింగ్, వెంటిలేషన్ వ్యవస్థలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌తో పాటు ఇతర కీలక భద్రతా మౌలిక సదుపాయాలను ఈ కార్యక్రమం ద్వారా పరిశీలించనుంది. అగ్నిమాపక పరికరాలు, నీటి లభ్యత, పంపింగ్ ఏర్పాట్లు, స్ప్రింక్లర్ వ్యవస్థలు వాటిని తనిఖీలు చేయనుంది. ఏదైనా అనుకొని ఘటన జరిగినప్పుడు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయా.. లేదా అనేది నిర్ధారించుకోవడమే లక్ష్యంగా ఈ భారీ కార్యక్రమం రైల్వేశాఖ చేపట్టనుంది.
ఈ ఆడిట్ ద్వారవా నిర్దేశించిన అగ్నిమాపక భద్రత, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారా లేదా అని కూడా అంచనా వేయనుంది. ఆడిట్ అనంతరం తనిఖీ ప్రక్రియలో గుర్తించిన లోపాలను పరిష్కరించనుది. రైల్వేలోని వివిధ శాఖల అధికారులతో కూడిన సంయుక్త తనిఖీ బృందాలు ఆడిట్‌లను త్వరలో నిర్వహించనున్నాయి. ప్రత్యేక ఏజెన్సీలు, రాష్ట్ర అగ్నిమాపక శాఖల సహాయం కూడా రైల్వేశాఖ ఈ కార్యక్రమం కోసం తీసుకోనుంది.

Follow Us