Indian Railways: రైల్వే ప్రయాణికులకు సూపర్ న్యూస్.. ఆర్డర్ చేస్తే మీ సీటు వద్దకే ఫుడ్.. ఐఆర్‌సీటీసీ ద్వారా..

ఇండియన్ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లల్లో ఈ-ప్యాంట్రీ సేవలను ప్రారంభించింది. ప్రస్తుత కొన్ని రైళ్లల్లో ప్రవేశపెట్టగా.. త్వరలో అన్ని రైళ్లకు విస్తరించేందుకు అడుగులు వేస్తోంది. దీని ద్వారా ప్రయాణికులు ఫుడ్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండనే ఉండదు.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు సూపర్ న్యూస్.. ఆర్డర్ చేస్తే మీ సీటు వద్దకే ఫుడ్.. ఐఆర్‌సీటీసీ ద్వారా..
Trains Food Delivery

Updated on: Feb 09, 2026 | 8:37 PM

ప్రయాణికులకు రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. రైలు ప్రయాణంలో ఆహారం కోసం ఇబ్బంది పడకుండా కొత్త సౌకర్యాన్ని తీసుకొచ్చింది. అదే రైళ్లల్లో అందుబాటులో ఉండే ప్యాంట్రీ కార్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకునే విధానం. ప్రస్తుతం వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ సౌకర్యాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. అది విజయవంతం కావడంతో తాజాగా 25 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో అందుబాటులోకి తెచ్చారు. రాబోయే రోజుల్లో ప్యాంట్రీ కార్ ఉన్న అన్ని రైళ్లల్లో ఈ సదుపాయం కల్పించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. దీంతో ప్రయాణికులు ట్రైన్ ప్రయాణంలో ఆహారం కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఐఆర్‌సీటీసీ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఫుడ్ బుక్ చేసుకుంటే మీ సీటు వద్దకే తెచ్చి ఇస్తారు.

ఎలా పొందాలంటే..?

-ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఫుడ్ ఫ్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది

-ఐఆర్‌సీటీసీ ఫ్లాట్‌ఫామ్‌లలో బుక్ డ్ టికెట్ హిస్టరీ ఆప్షన్ క్లిక్ చేయాలి

-అక్కడ ఈ-ప్యాంట్రీ మీల్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి

-ఆ తర్వాత వెరిఫికేషన్ కోడ్ మీ మొబైల్‌కు వస్తుంది

-ట్రైన్ ఎక్కాక ప్యాంట్రీ సిబ్బంది ఫుడ్ మీ సీటు దగ్గరకే తెచ్చి అందిస్తారు

-ఫుడ్ డెలివరీ చేసే సమయంలో వెరిఫికేషన్ కోడ్ చెప్పాలి

-ఇక ఫుడ్ కోసం డిజిటల్ పేమెంట్స్ చేయవచ్చు

-ఇక మీకు ఒకవేళ ఫుడ్ డెలివరీ కాకపోతే మొబైల్, ఈమెయిల్‌కు క్యాన్సిలేషన్ మెస్సేజ్ వస్తుంది

-రీఫండ్ కూడా మీ బ్యాంక్ అకౌంట్ల వెంటనే జమ అవుతుంది

-ఈ-ప్యాంట్రీ ద్వారా స్టాండర్డ్ లేదా రైల్ నీల్ బుక్ చేసుకునే సదుపాయం ఉంది

-ఇక మీ ఆర్డర్‌ను వెరిఫికేషన్ కోడ్ ఆధారంగా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు

ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో కూడా..

ప్రస్తుత విశాఖ నుంచి సేవలు అందిస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో కూడా ఈ-ప్యాంట్రీ సదుపాయం అమల్లో ఉంది. త్వరలో అన్ని రైళ్లకు విస్తరించేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే దీనిని అన్ని రైళ్లల్లో ప్రవేశపెట్టనున్నారు. ప్రయాణికులు ముందుగానే ఫుడ్ బుక్ చేసుకోవడం వల్ల ఈ ప్యాంట్రీ సౌకర్యం ద్వారా మీ సీటు వద్దకే డెలివరీ చేశారు. దీంతో ట్రైన్ ఎక్కాక ఫుడ్ కోసం ఇబ్బంది పడాల్సిన  అవసరం ఉండదు. ట్రైన్ ప్రయాణాల సమయంలో ఫుడ్ అందుబాటులో లేకపోవడంతో  ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆ సమస్యను పరిష్కరించేందుకు రైల్వేశాఖ ఈ కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. దీంతో ఇది ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉండనుందని చెప్పవచ్చు.